![]() |
![]() |

ఐశ్వర్యా రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ ముద్దుల తనయ ఆరాధ్య బచ్చన్ 9వ బర్త్‌డేని కుటుంబం సెలబ్రేట్ చేసింది. అయితే ఆమెకు ఈ ప్రపంచంలో అంతా హ్యాపీగా ఉండాలని విష్ చేసింది, ఆమె తాతయ్య అమితాబ్ బచ్చన్.ఆనందకరమైన ఆరాధ్య పుట్టినరోజు సందర్భంగా, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ఇప్పటి దాకా ఆరాధ్య జరుపుకున్న 9 పుట్టినరోజులకు సంబంధించిన 9 ఫొటోలను, అంటే ఒకటో ఏట నుంచి 9వ ఏట దాకా అమూల్యమైన పిక్చర్లను ఒక ఆల్బమ్‌లాగా షేర్ చేశారు.
ఆ ఆల్బమ్‌లో తొమ్మిది బాక్సులను మనం చూడొచ్చు. ఒక్కో బాక్స్‌లో ఆరాధ్య ఒక్కో క్లోజప్ ఫొటో ఉంది. రకరకాల మూడ్స్‌లో, హావభావాల్లో ఉన్న చిన్నారి ఆరాధ్య కెమెరాకు ఇచ్చిన పోజులు ముచ్చటగొలుతున్నాయి. ఒక ఫొటోలో తప్పితే మిగతా అన్నింటిలోనూ రకరకాల క్యూట్ హెడ్‌బ్యాండ్స్‌తో ఆకట్టుకుంటోంది ఆరాధ్య.మనవరాలికి ఆశీస్సులందజేస్తూ, “Happy birthday Aaradhya .. all my love." అని రాశారు అమితాబ్ బచ్చన్.

![]() |
![]() |