![]() |
![]() |

అందరి మాదిరిగానే సినీ కుటుంబాలు కూడా దీపావళి పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నాయి. కుటుంబ సభ్యులందరూ కలిసి ఒకచోట చేరి, పంచభక్ష్య పరమాన్నాలతో భోజనాలు చేయడం, ప్రత్యేకమైన పండగ దుస్తుల్లో మెరవడం, తనివితీరా కబుర్లు చెప్పుకోవడంతో ఈ పండగ బాగానే గడిచింది. పెద్దలైతే ఇంట్లో చిన్నారి పిల్లలు ఆడుతూ పాడుతూ తిరుగుతుంటే చూసి సంబరపడ్డారు. అలాంటి సంబరాన్నే మంచు ఫ్యామిలీ పొందింది. మనవడు, మనవరాళ్లు కళ్లముందు ఆడుతుంటే తాతయ్య మోహన్‌బాబు మనసారా ఆనందించారు.
కాగా ఈ దీపావళి సందర్భంగా పిల్లలు, పెద్దలు కలిసి దిగిన ఫొటోలను లక్ష్మీ మంచు తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో షేర్ చేశారు. ఆమె, ఆమె కుమార్తె విద్యా నిర్వాణ పింక్ డ్రస్సుల్లో మెరిసిపోయారు. నవంబర్ 14 దీపావళి మాత్రమే కాదు, జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా జరుపుకొనే బాలల దినోత్సవం కూడా. అందుకే కూతురితో కలిసి డాన్స్ చేసిన చిన్న వీడియోను కూడా లక్ష్మి షేర్ చేశారు. విద్యా నిర్వాణకు తల్లిగా ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా కుమార్తెకు ఆమె థాంక్స్ కూడా చెప్పారు. అలాగే తల్లిదండ్రులు నిర్మల, మోహన్‌బాబు, సోదరుడు విష్ణు, ఆయన భార్య విరానిక, పిల్లలతో కలిసి తీయించుకున్న ఫొటోలను ఆమె షేర్ చేశారు. అయితే ఈ ఫొటోలకు న్యూ ఇయర్ విషెస్‌ను క్యాప్షన్‌గా పెట్టడంతో చాలా మంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే మనం ఇంకా నవంబర్లోనే ఉన్నాం. నూతన సంవత్సరానికి ఒకటిన్నర మాసం సమయం ఉంది. అయినప్పటికీ "Wishing all of you a very Happy, Healthy & Prosperous New Year! Stay Home, Stay Close to your loved ones and spread kindness across" అంటూ ఆమె రాసుకొచ్చారు.
.jpg)
.jpg)
.jpg)
.jpg)
దీంతో కామెంట్స్ సెక్షన్లో పలువురు దీన్ని ప్రస్తావించి, "న్యూ ఇయర్ కాదమ్మా దీపావళి శుభాకాంక్షలు" అంటూ కామెంట్ చేశారు. ఒకరు "ఈరోజు న్యూ ఇయరా.. నాకు తెలీదే" అని కామెంట్ చేస్తే, ఇంకొకరు "మేడమ్ ఇది దీపావళి.. న్యూ ఇయర్ కాదు" అని చెప్పారు. కాగా మోహన్‌బాబు చేతిలో డ్రింక్ ఉన్న గ్లాస్ కనిపించడంతో.. ట్రోల్ కూడా చేశారు. ఒకరు "అరేయ్ మావా ఏక్ పెగ్‌లా" అని రాస్తే, మరొకరు "దీవాలీ రోజు ఆల్కహాల్ ఏంటయ్యా మోహన్‌బాబు" అని కామెంట్ పెట్టారు.
కాగా ఈ పిక్చర్స్‌లో స్పష్టంగా కనిపించిన విషయం మనోజ్ లేకపోవడం. దాంతో "మనోజ్ ఎక్కడ?" అని ఫ్యాన్స్ ప్రశ్నించారు.
.jpg)
.jpg)
.jpg)
![]() |
![]() |