![]() |
![]() |
.jpg)
మిల్కీ బ్యూటీ తమన్నా నటించగా చాలా కాలం నుంచి విడుదలకు నోచుకోకుండా ఉన్న 'దటీజ్ మహాలక్ష్మి' సినిమా నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై రిలీజయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలీని అయోమయ స్థితి ఉన్నందున నిర్మాతలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కంగనా రనౌత్ నటించిన బ్లాక్‌బస్టర్ హిందీ సినిమా 'క్వీన్'కు 'దటీజ్ మహాలక్ష్మి' రీమేక్. 2017లోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లింది. షూటింగ్ పూర్తయి ఏడాది పైగానే గడిచినా ఇంతదాకా విడుదల కాకుండా ఆగింది. మిగతా భాషల్లో రీమేక్ చేసిన సినిమాలు సెన్సార్ బోర్డ్ దగ్గర సమస్యలు ఎదుర్కోవడం కూడా దీనికి ఓ కారణం.
ఇక ఇప్పుడు నిర్మాతలు 'దటీజ్ మహాలక్ష్మి'తో పాటు కాజల్ అగర్వాల్ నటించిన తమిళ రీమేక్ 'పారిస్ పారిస్'ను కూడా ఓటీటీలో రిలీజ్ చేసే పనిలో పడ్డారు. ఓటీటీ దిగ్గజాల్లో ఒకటైన అమెజాన్ ప్రైమ్ వీడియో నిర్వాహకులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అగ్రిమెంట్ అవగానే అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నది.
'క్వీన్' మూవీ నాలుగు దక్షిణాది భాషల్లో రీమేక్ అవుతోంది. తెలుగు, తమిళంలోనే కాకుండా, కన్నడంలో 'బటర్‌ఫ్లై' పేరుతో, మలయాళంలో 'జమ్ జమ్' టైటిల్‌తో తయారైంది. 'దటీజ్ మహాలక్ష్మి' డైరెక్టర్ పేరును నిర్మాతలు ప్రకటించకపోవడం గమనార్హం. తమిళ, కన్నడ వెర్షన్లు రెండింటినీ రమేశ్ అరవింద్, మలయాళ మూవీని తెలుగు డైరెక్టర్ నీలకంఠ రూపొందించారు.
![]() |
![]() |