![]() |
![]() |

కోలీవుడ్ స్టార్ కార్తి, మిల్కీ బ్యూటీ తమన్నా.. సిల్వర్ స్క్రీన్ హిట్ పెయిర్. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ముచ్చటగా మూడు సినిమాలు రాగా, మూడు కూడా జనాల్ని రంజింపజేశాయి. 'పయ్యా' (ఆవారా), 'సిరుత్తై' (విక్రమార్కుడుకి తమిళ వెర్షన్), 'ఊపిరి' (తోళా).. ఇలా కార్తి, తమన్నా జంటగా నటించిన ఈ చిత్రత్రయాలు మంచి విజయం సాధించాయి.
కట్ చేస్తే.. ఇప్పుడు ఈ ఇద్దరు బాక్సాఫీస్ వార్ కి సై అంటున్నారు.
ఆ వివరాల్లోకి వెళితే.. ఏప్రిల్ 2న యాక్షన్ హీరో గోపీచంద్ కి జోడీగా తమన్నా నటించిన స్పోర్ట్స్ డ్రామా 'సీటీమార్' రిలీజ్ కానుంది. సంపత్ నంది డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కబడ్డీ కోచ్ గా ఈ టాలెంటెడ్ యాక్ట్రస్ దర్శనమివ్వనున్నారు. కట్ చేస్తే.. అదే రోజున కార్తి, రష్మిక మందన్న జంటగా నటించిన తమిళ అనువాద చిత్రం 'సుల్తాన్' థియేటర్స్ లో సందడి చేయనుంది.
మరి.. హిట్ పెయిర్ మధ్య సాగుతున్న ఈ బాక్సాఫీస్ వార్ లో ఎవరు విన్నర్ గా నిలుస్తారో తెలియాలంటే ఏప్రిల్ 2 వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |