![]() |
![]() |

బాలీవుడ్ మూవీ దబాంగ్ 3లో మున్నీ కా బద్ నామ్ రీమిక్స్ లో చిందేసిన వారినా హుస్సేన్.. యంగ్ టైగర్ యన్టీఆర్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో ఓ హీరోయిన్ గా నటించబోతున్నట్లు ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే, దీనికి సంబంధించి యూనిట్ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు.
ఈ లోపే, వారినా హుస్సేస్ కి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. అదేమిటంటే.. యన్టీఆర్ అన్న, ప్రముఖ కథానాయకుడు కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త చిత్రంలో ఈ హాట్ బ్యూటీ.. స్పెషల్ డాన్స్ నంబర్ చేసిందట. మల్లిడి వేణు డైరెక్ట్ చేస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో వారినా ఐటమ్ సాంగ్ చేసిందని.. ఇటీవలే ఈ పాటకి సంబంధించిన చిత్రీకరణని రామకృష్ణ హార్టి కల్చర్ స్టూడియోలో పూర్తిచేశారని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశముంది.
మొత్తమ్మీద.. తారక్ సినిమాలో వారినా ఎంట్రీ సంగతేమో కానీ.. కళ్యాణ్ రామ్ కొత్త చిత్రంలో మాత్రం ఈ రీమిక్స్ మున్ని సోయగాలతో గాలాలు వేయనుందన్నమాట.
![]() |
![]() |