![]() |
![]() |

ఇటీవల దర్శకురాలిగా పదేళ్ల కెరీర్ ని పూర్తిచేసుకున్నారు నందినీ రెడ్డి. ఈ పదేళ్ళ కెరీర్ లో కేవలం నాలుగు చిత్రాలకే పరిమితమయ్యారావిడ. అలా మొదలైంది (2011), జబర్ దస్త్ (2013), కళ్యాణ వైభోగమే (2016), ఓ బేబీ (2019).. ఇలా నందిని నుంచి వచ్చిన ఈ నాలుగు సినిమాల్లో జబర్ దస్త్ ఒక్కటే పూర్తిగా నిరాశపరిచింది.
ఇదిలా ఉంటే.. ఓ బేబీ తరువాత మరో ఫీచర్ ఫిల్మ్ ని పట్టాలెక్కించని నందిని.. తన నెక్ట్స్ వెంచర్ ని యువ కథానాయకుడు సంతోష్ శోభన్ కాంబినేషన్ లో చేయబోతున్నారని సమాచారం. స్వప్న సినిమా పతాకంపై స్వప్నాదత్, ప్రియాంకా దత్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమా.. నందిని గత చిత్రాల తరహాలోనే రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గానే తెరకెక్కనుందట. త్వరలోనే పట్టాలెక్కనున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ని.. కేవలం రెండు నెలల్లో పూర్తిచేసే దిశగా నందిని అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశముంది.
కాగా, నాలుగు షార్ట్ ఫిల్మ్ ల ఆంథాలజీగా తెరకెక్కిన పిట్ట కథలులో ఓ షార్ట్ ఫిల్మ్ ని నందినీ రెడ్డి తెరకెక్కించారు. ఫిబ్రవరి 19న నెట్ ఫ్లిక్స్ లో ఈ ఆంథాలజీ స్ట్రీమ్ కానుంది.
![]() |
![]() |