![]() |
![]() |

బడ్జెట్ విషయాలు తన భర్తకు వదిలేశాననీ, అంకెలకు తాను చాలా దూరంగా ఉంటున్నాననీ మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత కొణిదెల చెప్పుకొచ్చారు. 'షూట్ అవుట్ ఎట్ ఆలేరు' వెబ్ సిరీస్ తో సుష్మిత, విష్ణు ప్రసాద్ దంపతులు ప్రొడక్షన్ లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. జీ5 ఓటీటీలో క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25 నుంచి ఎక్స్ క్లూజివ్ గా స్ట్రీమింగ్ కానుంది. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ పోలీసులుగా నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ ను ఇటీవలే విడుదల చేశారు.
కాస్ట్యూమ్ డిజైనర్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రవేశించిన తాను సహజంగానే ప్రొడక్షన్ లోకి వచ్చానని సుష్మిత కొణిదెల చెబుతున్నారు. తండ్రి నటించిన సినిమాల సెట్స్ లో బుడిబుడి అడుగులు వేసిన తనకు ప్రొడక్షన్ పెద్ద కష్టంగా అనిపించలేదని ఆమె అన్నారు. తాను ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తానన్నప్పుడు తమ్ముడు రామ్ చరణ్ పెద్దగా ఆశ్చర్యపోలేదని సుష్మిత తెలిపారు. తండ్రి చిరంజీవి సంతోషించారని ఆమె అన్నారు.
ఓటీటీ వేదికల గురించి సరికొత్త ఐడియాల గురించి తండ్రితో డిస్కస్ చేశానని సుష్మిత చెప్పారు. బడ్జెట్ విషయాలు మాత్రం తన భర్తకు వదిలేశానని ఆమె అన్నారు. విష్ణుది వ్యాపార నేపథ్యం కాబట్టి లెక్కలు అతనికి బాగా తెలుస్తాయని సుష్మిత నవ్వేశారు.
.jpg)
![]() |
![]() |