![]() |
![]() |

మహేశ్ కెరీర్‌లోని బిగ్గెస్ట్ డిజాస్టర్స్‌లో శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్‌లో చేసిన 'బ్రహ్మోత్సవం' ఒకటి. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' లాంటి హిట్ ఇచ్చిన శ్రీకాంత్‌తో మరో సినిమా చెయ్యాలని నిర్ణయించుకున్న మహేశ్, 'బ్రహ్మోత్సవం' చేశారు. కానీ సరైన కథ లేకుండా సన్నివేశాల అల్లికగా సాగిన ఆ మూవీని ప్రేక్షకులు తిరస్కరించారు. ఆ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో మహేశ్ తన మనసులోని మాట చెప్పారు. 'బ్రహ్మోత్సవం' లాంటి ఫ్లాప్స్ వచ్చినప్పుడు కచ్చితంగా డిప్రెస్ ఫీలవుతానని ఆయన అన్నారు.
"ఆ డిప్రెషన్ నుంచి నన్ను నేను బయటపడేసేది నా పిల్లలే. వాళ్లతో ఉంటే ఆ బాధ తగ్గిపోతుంది. 'బ్రహ్మోత్సవం' ఫలితానికి బాగా డిజప్పాయింట్ అయిన మాట నిజం. ఆ సినిమా చేయడం రాంగ్ డెసిషన్. దాని వల్ల చాలా మంది డబ్బులుపోయాయి. చాలా మంది బాధపడ్డారు. నన్ను నమ్మి డబ్బులు పెట్టినవాళ్లు నష్టపోతే కలిగే బాధను మాటల్లో వివరించలేను. అలాంటి అనుభవాలే పాఠాలు. మరోసారి అలాంటి స్థితి రాకుండా చూసుకునే బాధ్యతను ఫీలవుతాను. కొన్నిసార్లు మనం అనుకున్నవి తలకిందులవుతుంటాయి. 'బ్రహ్మోత్సవం' అలాంటిదే" అని చెప్పారు మహేశ్.
![]() |
![]() |