![]() |
![]() |

ఇస్మార్ట్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఇప్పటివరకు సోషల్ డ్రామాలే చేశారు. కెరీర్ లో ఫస్ట్ టైమ్ ఓ హిస్టారికల్ ఫాంటసీ మూవీ చేయబోతున్నారట. అది కూడా.. ఎలాంటి జానర్స్ లో అయినా ఇట్టే ఒదిగిపోయే నటసింహ బాలకృష్ణతో.
ఆ వివరాల్లోకి వెళితే.. 'పైసా వసూల్' రూపంలో బాలయ్యని తొలిసారి డైరెక్ట్ చేసిన పూరి.. ఆ సినిమా షూటింగ్ టైమ్ లోనే బాలయ్యని తన టేకింగ్ తో ఇంప్రెస్ చేశారు. మరో చిత్రం చేసేందుకు నటసింహ నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా పొందారు. అయితే, తదనంతర కాలంలో వేర్వేరు ప్రాజెక్ట్స్ తో బిజీగా మారిన ఈ ఇద్దరూ త్వరలో హిస్టారికల్ టచ్ ఉన్న సబ్జెక్ట్ కోసం మళ్ళీ జట్టుకట్టనున్నారట. త్వరలోనే ఈ క్రేజీ వెంచర్ కి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశముంది.
కాగా, ప్రస్తుతం బోయపాటి కాంబినేషన్ మూవీతో బాలయ్య.. విజయ్ దేవరకొండ కాంబినేషన్ ఫిల్మ్ 'ఫైటర్'తో పూరి బిజీగా ఉన్నారు.
![]() |
![]() |