![]() |
![]() |

సూపర్‌స్టార్ మహేశ్ ఫ్యామిలీ తర్వాత ఇప్పుడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వంతు. దుబాయ్‌లో భార్యా పిల్లలతో మహేశ్ ఆహ్లాదంగా గడిపి ఇలా హైదరాబాద్‌లో అడుగుపెట్టాడో లేదో, ఇప్పుడు తారక్ తన భార్య లక్ష్మీప్రణతి, పెద్ద కొడుకు అభయ్ రామ్‌తో కలిసి దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చేశాడు. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో వాళ్లతో కలిసి బయటకు నడుచుకుంటూ వస్తూ కెమెరా కంటికి చిక్కాడు. ఇటీవలే రాజమౌళి మూవీ 'ఆర్ఆర్ఆర్' షూటింగ్‌లో పాల్గొన్న తారక్, కొద్ది రోజులు గ్యాప్ రావడంతో ఫ్యామిలీతో కలిసి గడపడానికి దుబాయ్ వెళ్లాడు. బ్లూ జీన్స్, మెరూన్ కలర్ టీ షర్ట్‌తో క్యాజువల్ లుక్‌లో ఉన్నాడు తారక్. ముగ్గురూ ఫేస్ మాస్క్‌లు ధరించారు. అయితే తారక్ చిన్నకొడుకు రెండేళ్ల భార్గవ్ రామ్ మాత్రం కనిపించలేదు. అతడిని ఇంట్లోనే పెద్దల దగ్గర వదిలిపెట్టి వచ్చినట్లు తెలుస్తోంది.
దుబాయ్‌లో తారక్ ఎలా గడపాడనే పిక్చర్స్ బయటకు రాలేదు. అయితే అక్కడ్నుంచి వచ్చిన వెంటనే 'ఆర్ఆర్ఆర్' షూట్‌లో అతను పాల్గొంటాడని అంతర్గత వర్గాలు తెలిపాయి. ఇటీవల కొవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ తాము షూటింగ్‌లో ఎలా పాల్గొంటున్నామో తెలియజేస్తూ బిహైండ్ ద సీన్స్ వీడియోను తారక్ షేర్ చేశాడు. 'ఆర్ఆర్ఆర్' మూవీలో జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్, ఆలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవ్‌గణ్, శ్రియ, సముద్రకని తదితరులు నటిస్తున్నారు.
.jpg)
![]() |
![]() |