![]() |
![]() |

అగ్ర దర్శకుడు బోయపాటి శ్రీను చిత్రాల్లో కథానాయకుల పాత్రలు ఎంత శక్తిమంతంగా ఉంటాయో.. ప్రతినాయకుల పాత్రలు కూడా అంతే దీటుగా ఉంటాయి. అందుకే.. ఆయన రూపొందించే సినిమాల్లో ప్రతినాయకుల పాత్రల్లో నటించేందుకు బాలీవుడ్ నటులు సైతం ఆసక్తి చూపిస్తుంటారు. తన గత చిత్రం వినయ విధేయ రామలో బాలీవుడ్ యాక్టర్ వివేక్ ఒబెరాయ్ ని పవర్ ఫుల్ విలన్ గా ఆవిష్కరించిన బోయపాటి.. నటసింహ నందమూరి బాలకృష్ణతో ప్రస్తుతం చేస్తున్న హ్యాట్రిక్ ఎటెంప్ట్ BB3 (వర్కింగ్ టైటిల్)లోనూ మరో బాలీవుడ్ స్టార్ ని ప్రతినాయకుడిగా ఎంచుకున్నారట.
ఆ స్టార్ మరెవరో కాదు.. సునీల్ శెట్టి. తొలుత ఈ పాత్ర కోసం సంజయ్ దత్, వివేక్ ఒబెరాయ్ వంటి బాలీవుడ్ ప్రముఖుల పేర్లు వినిపించాయి. ఇప్పుడు సునీల్ పేరు చేరింది. మరి.. సునీల్ వార్తలకే పరిమితమవుతారో లేదంటే టీమ్ లో జాయిన్ అవుతారో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచిచూడాల్సిందే. కాగా, ఈ చిత్రంలో మరో విలన్ గా టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ నటిస్తున్నారు. ఇందులో ఆయన రాజకీయ నాయకుడి పాత్రలో దర్శనమిస్తారని టాక్.
![]() |
![]() |