![]() |
![]() |

అందాల రాశీ ఖన్నా ఇప్పుడు టాలీవుడ్‌లో కంటే కోలీవుడ్‌లోనే ఎక్కువ బిజీగా ఉంటోంది. తమిళంలో మేధావి, తుగ్లక్ దర్బార్, అరణ్‌మణై సినిమాలను ఆమె చేస్తోంది. లేటెస్ట్ బజ్ ప్రకారం టాలీవుడ్‌లో దుల్కర్ సల్మాన్ హీరోగా 'కృష్ణగాడి వీరప్రేమ గాథ' ఫేమ్ హను రాఘవపూడి రూపొందించనున్న సినిమాలో ఓ హీరోయిన్‌గా రాశీ నటించనుందని వినిపిస్తోంది. ఇందులో మరో హీరోయిన్‌గా పూజా హెగ్డే ఇదివరకే ఎంపికైంది.
కాగా ఇటీవలే 30వ పుట్టినరోజు జరుపుకున్న ఈ సుందరాంగికి రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఉందంట. చిన్నప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ కావాలని కలలు కన్నాననీ, కానీ యాదృచ్ఛికంగా నటినయ్యాననీ ఆమె చెప్పింది. సినిమాల్లోకి వచ్చాక చాలా విషయాలు తెలుసుకున్నాననేది ఆమె మాట. "ఇప్పుడు ఎలాగూ ఐఏఎస్ ఆఫీసర్ కాలేను. కానీ ఫ్యూచర్‌లో తప్పకుండా పాలిటిక్స్‌లోకి వెళ్తాను." అని ఆమె చెప్పింది.
పాలిటిక్స్‌లోకి ఎంటర్ కావడానికి ముందే ఓ ఎన్జీవోను స్టార్ట్ చేస్తానని రాజీ అంటోంది. ప్రజల సమస్యలు తెలుసుకొని, వారికి అండగా ఉండటం తనకు ఇష్టమైన పని అని ఆమె చెప్తోంది. రాజకీయాల్లోకి వస్తే, రాజకీయాలు చేయడం కాకుండా ప్రజాసేవ చేస్తాననేది రాశీ మాట.
![]() |
![]() |