![]() |
![]() |

నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన యాక్షన్ డ్రామా లెజెండ్ చిత్రంతో ఫ్యామిలీ హీరో జగపతిబాబు విలన్ గా టర్న్ అయ్యారు. ఆపై పలు చిత్రాల్లో విలన్ గానూ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ సందడి చేశారు, చేస్తున్నారు. మరీ ముఖ్యంగా.. మెగా కాంపౌండ్ లో వరుస సినిమాలు చేస్తూ అలరిస్తున్నారాయన. ఆ మధ్య సుప్రీమ్ హీరో సాయితేజ్ నటించిన పిల్లా నువ్వు లేని జీవితం, విన్నర్ చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించిన జగ్గూ భాయ్.. అనంతరం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలంలో ప్రతినాయకుడిగా దర్శనమిచ్చారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ సైరా.. నరసింహారెడ్డిలో ముఖ్య భూమిక పోషించారు.
ఈ క్రమంలోనే మరో మెగా హీరోతో జట్టుకట్టనున్నారట జగపతిబాబు. ఆ వివరాల్లోకి వెళితే.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా డెబ్యూ డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి ఓ స్పోర్ట్స్ డ్రామాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులోనే జగ్గూ భాయ్ మెయిన్ విలన్ గా కనిపిస్తారట. మరి.. ఈ కథనాల్లో నిజానిజాలెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
![]() |
![]() |