![]() |
![]() |

మెగా హీరోలంటేనే చాలు.. సెటైర్లతో చెలరేగిపోతుంటారు నిత్యం వార్తల్లో ఉండేందుకు ఇష్టపడే అలనాటి అగ్ర దర్శకుడు, నేటి బి-గ్రేడ్ సినిమాల డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ. మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబులపై తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా సెటైర్లు వేసే ఆర్జీవీ.. 'పవర్‌స్టార్' పేరిట ఓ సెటైరికల్ మూవీని సైతం తీసిన విషయం మనకు తెలుసు. అయితే మెగా హీరోల్లో ఆయనకు ఒకరు నచ్చారు. అతను.. నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్.
2014లో 'ముకుంద' సినిమాతో వరుణ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. దాని తర్వాత రెండో సినిమా 'కంచె' (2015)తో నటుడిగా చక్కని అభినయాన్ని ప్రదర్శించి ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసల్ని అందుకున్నాడు. ఆ సినిమా వచ్చిన కొద్ది రోజులకు, పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో చేసిన 'లోఫర్' సినిమా విడుదలకు ముందు వరుణ్ గురించి మంచి మాటలు చెప్పాడు ఆర్జీవీ.
"వరుణ్ తేజ్ లో నాకు నచ్చేదేంటంటే.. వరుణ్ 'మెగా' ట్రీ నుంచి వచ్చే ఎలక్ట్రిక్ పవర్ మీద ఆధారపడడు, తన సొంత సోలార్ బ్యాటరీ తనకుంటుంది. అలా ఆధారపడితే ఒక్కోసారి ఆ ఎలక్ట్రిసిటీనే.. పవర్ లేకుండా చేయవచ్చు. స్టార్ పవర్ అంటే 'పవర్ స్టార్' మీద, అలాగే 'మెగా' ఎలక్ట్రిసిటీ మీద ఆధారపడకపోవడమే. వరుణ్ తేజ్ చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకునే బ్యాచ్ కాదు. చెట్టుని గౌరవిస్తాడు కానీ కొమ్మలాగ బతకడం కోరుకోడు" అంటూ తన స్టైల్లో ట్విట్టర్ వేదికగా ఆయన రాసుకొచ్చాడు. ఇలా ఓ మెగా హీరోను వర్మ మెచ్చుకోవడం అంటే మాటలా!!
![]() |
![]() |