![]() |
![]() |

మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల పెళ్లి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. బుధవారం, డిసెంబర్ 9న నిహారిక మెడలో మూడు ముళ్లు వేయడానికి చైతన్య జొన్నలగడ్డ రెడీ అవుతున్నాడు. ఒక్క పవన్ కల్యాణ్ మినహా మెగా ఫ్యామిలీకి చెందిన మిగతా వారంతో రాజస్తాన్‌లోని వివాహ వేడుక వేదిక అయిన ఉదయ్‌పూర్‌లోని ఉదయ్ విలాస్ ప్యాలెస్‌కు చేరుకున్నారు. సోమవారం రాత్రి జరిగిన సంగీత్ వేడుకలో నిహారిక, చైతన్య జంటగా డాన్సు చేశారు.

దీనికి సంబంధించిన వీడియో క్లిప్సు, పిక్చర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. వాటిలో ఆ జంట స్టన్నింగ్‌గా కనిపిస్తున్నారు. సంగీత్ వేడుకలో శంతను-నిఖిల్ డిజైన్ చేసిన గ్రీన్ లెహంగాలో నిహారిక చుక్కలాగా మెరిసిపోయింది. సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ శాండీ ఆమెకు స్టైలింగ్ చేశారు. ఫ్యాన్స్ షేర్ చేసిన వీడియోలలో నిహారిక, చైతన్య స్టేజిపై మెగా స్టార్ సాంగ్స్‌కు స్టెప్పులేస్తూ కనిపించారు. ఒక ఫొటోలో నిహారిక మైక్ పట్టుకొని కూర్చొని వున్న తన తండ్రి నాగబాబు పక్కన నిల్చొని ఉంటే, ఇంకో పిక్చర్‌లో తన కజిన్ శ్రీజ (చిరు చిన్న కూతురు) దంపతులతో కలిసి కనిపించింది.



నిహారిక, చైతన్య కుటుంబాలు రెండూ సోమవారం ఉదయం ప్రత్యేక ఫ్లైట్‌లో బయలుదేరి ఉదయ్‌పూర్‌కు వెళ్లారు. దీనికి సంబంధించిన ఫొటోను షేర్ చేసిన వరుణ్ తేజ్, దానికి "Off we go." అనే క్యాప్షన్ జోడించాడు.

![]() |
![]() |