![]() |
![]() |

ఇప్పటి రోజుల్లో సినిమాల్లో బ్యూటిఫుల్ మదర్ ఎవరంటే వెంటనే స్ఫురించే వాళ్లల్లో ప్రగతి ఒకరు. యంగ్ హీరోలు లేదా హీరోయిన్లకు మదర్‌గా నటిస్తూ లేదా ఆంటీ క్యారెక్టర్లు చేస్తూ ఆమె మంచి పేరు తెచ్చుకున్నారు. ఆమెలో ఆకట్టుకొనే అంశాల్లో టిపికల్ డైలాగ్ డిక్షన్ కూడా ఒకటి. అలాంటి ప్రగతి ఫిట్‌నెస్ విషయంలోనూ శ్రద్ధ చూపిస్తుంటారని ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెను ఫాలో అయ్యే వాళ్లకు తెలుసు. సాధారణంగా ఫిగర్‌ను మెయిన్‌టైన్ చెయ్యడానికి హీరోయిన్లు వర్కవుట్స్ చేస్తుంటారు. సమంత, రకుల్‌ప్రీత్, పూజా హెగ్డే వంటి వాళ్లు కాస్త కఠినమైన వర్కవుట్స్ చేస్తుంటారు. అలాంటిది ప్రగతి సైతం ఫిట్‌నెస్ కోసం కఠినమైన ఆసనాలు వేస్తున్నారు. హీరోయిన్లకు సవాలు విసురుతున్నారు.
లాక్‌డౌన్‌లో లభించిన తీరిక సమయాన్ని ఎలా వినియోగించుకుంటోందో తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ సాక్షిగా ఆమె బహిర్గతం చేశారు. స్కిన్‌టైట్ స్పోర్ట్స్ వేర్ వేసుకొని ఉన్న ఆమె రెండు ఫొటోలను షేర్ చేశారు. వాటిలో ఒకదానిలో హలాసనం వేసిన ఆమె, ఇంకో దానిలో తలక్రిందులుగా నిల్చొని నడుము వంచి గోడకు కాళ్లను ఆనించి ఒక కొత్త ఎక్సర్‌సైజ్ చేస్తున్నారు. ఈ పోస్ట్‌కు ఆమె గుడ్ వర్కవుట్ డే అనే క్యాప్షన్ జోడించారు. ఎప్పుడూ సినిమాల్లో నిండైన చీరకట్టుతో, నుదుటిన తిలకంతో భారతీయ స్త్రీకి నిలువెత్తు నిదర్శనంలా కనిపించే ప్రగతిని ఈ వేషంలో చూసినవాళ్ల మైండ్ బ్లాకవ్వాల్సిందే.

![]() |
![]() |