![]() |
![]() |

పూజా హెగ్డే, కాజల్ అగర్వాల్, త్రిష, తమన్నా, రకుల్, రాశి ఖన్నా, రెజీనా, అంజలి, లావణ్యా త్రిపాఠి తదితర టాప్ హీరోయిన్లు అందరూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. లాక్డౌన్ టైమ్‌లో డైలీ ఏం చేస్తున్నదీ చెబుతున్నారు. సమంత, రష్మిక మాత్రం మరీ సైలెంట్‌గా ఉంటున్నారు. అమావాస్య పౌర్ణమికి అన్నట్టు అరకొర పోస్టులు వేసి ఊరుకుంటున్నారు.
లాక్డౌన్ టైమ్‌లో రష్మిక రెండు పోస్టులు అంటే రెండు మాత్రమే చేశారు. వారం క్రితం చిన్నారి చెల్లాయితో సరదాగా ఆడుకుంటున్న ఫొటో పోస్ట్ చేశారు. "సహనం, సమయం... అది (కరోనా) తీసుకునేది ఈ రెండే. ఇంట్లో ఉండండి. సేఫ్ గా ఉండండి" అని పేర్కొన్నారు. ఏప్రిల్ 5న ఆమె పుట్టినరోజు. అప్పుడు ఏం చేసినదీ చెప్పలేదు. ఇన్‌స్టా స్టోరీలో కొంతమందికి రిప్లైలు ఇచ్చారంతే. పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన మిగతా వాళ్లకు నిన్న "మీ ప్రేమ, శుభాకాంక్షలకు కృతజ్ఞురాలిని" అని థాంక్స్ చెప్పారు. "(కరోనాపై) ఈ యుద్ధంలో విజయం సాధించడానికి మరికొంత సమయం పడుతుందంతే" అని పేర్కొన్నారు. అంతే కానీ.. తాను ఏం చేస్తున్నదీ చెప్పలేదు.
ప్రస్తుతం రష్మిక ఎక్కడున్నది? ఏం చేస్తున్నది? అని ఆరా తీస్తే... లాక్‌డౌన్‌కి ముందే హైదరాబాద్ నుండి కర్ణాటకలోని సొంతూరికి రష్మిక వెళ్లారని తెలిసింది. ఇంటి నుండి బయటకు రావడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పిన సూచనలను తప్పకుండా పాటిస్తున్నారు. ఎప్పటినుండో టైమ్ లేక చూడలేకపోతున్న డిజిటల్ షోస్ అన్ని చూస్తున్నారట. అలాగే, ఔత్సాహిక దర్శకులను కథలు పంపమని కొని రోజుల క్రితం కోరారు. చాలామంది పంపారట. ఇప్పుడు అవి చదువుతున్నారట. అలాగే, ఆరోగ్యం మీద మరింత దృష్టి సారించారట.
![]() |
![]() |