![]() |
![]() |

సందీప్ కిషన్ టైటిల్ రోల్ పోషిస్తోన్న పాన్ ఇండియా ఫిల్మ్ 'మైఖేల్'. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రత్యేక పాత్ర చేస్తోన్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు రంజిత్ జయకొడి దర్శకుడు. శనివారం సందీప్ కిషన్ బర్త్‌డే సందర్భంగా 'మైఖేల్' ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నిర్మాతలు విడుదల చేశారు. 'గాడ్ ఓన్లీ ఫర్‌గివ్స్' అనే కాప్షన్‌తో వచ్చిన ఈ పోస్టర్‌లో సందీప్ మునుపెన్నడూ లేని ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌తో ఆకట్టుకుంటున్నాడు. సిక్స్ ప్యాక్ బాడీతో ఫెరోషియస్ లుక్స్‌తో కనిపిస్తున్నాడు. చేతిలో ఆయుధాలతో తన వద్దకు వస్తోన్న దుండగులపై అతను గన్‌ను గురిపెట్టడం గమనించవచ్చు. యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా ఉండబోతోందని పోస్టర్ తెలియజేస్తోంది.
డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ విలన్‌గా నటిస్తోన్న ఈ మూవీలో సందీప్ జోడీగా మజిలీ ఫేమ్ దివ్యాంశ కౌశిక్ కనిపించనుంది. వరలక్ష్మీ శరత్‌కుమార్, వరుణ్ సందేశ్ కీలక పాత్రధారులు.
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న 'మైఖేల్' మూవీని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్ఎల్‌పి పతాకాలపై భరత్ చౌదరి, పుస్కూర్ రామ్మోహన్‌రావు నిర్మిస్తున్నారు. కిరణ్ కౌశిక్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నాడు.

![]() |
![]() |