![]() |
![]() |

లేడీ సూపర్‌స్టార్ నయనతార, తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్ సుదీర్ఘ కాలంగా ప్రేమలో ఉన్నారు. సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో తాము ప్రేమలో మునిగి తేలుతున్న క్షణాలకు సంబంధించిన అందమైన ఫొటోలను వారు తరచూ షేర్ చేస్తుంటారు. ఎప్పుడైతే వారు డేటింగ్ స్టార్ట్ చేశారో, అప్పట్నుంచీ వారెప్పుడు అధికారికంగా జీవిత భాగస్వాములుగా మారతారా అని అభిమానులు ఎదురుచూస్తూ వస్తున్నారు.
ఇప్పుడు వారి పెళ్లికి సంబంధించిన ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చింది. ఆ సమాచారం నిజమే అయితే, వచ్చే నెలలోనే నయనతార, విఘ్నేశ్ శివన్ పెళ్లి చేసుకోబోతున్నారు. అది కూడా.. తిరుమల వేంకటేశ్వరస్వామి సన్నిధిలో. జూన్ 9న ఆ ఇద్దరూ తిరుమల తిరుపతి దేవస్థానంలో తమ కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వారు దంపతులుగా మారుతున్నారంట. అయితే ఈ విషయాన్ని ఇద్దరిలో ఎవరూ ధ్రువీకరించలేదు.
ఇటీవల ఈ ప్రేమజంట షిర్డీలో ప్రత్యక్షమైంది. సాయిబాబా ఆశీస్సుల కోసం వారు ఆ పుణ్యస్థలాన్ని సందర్శించారు. సాయిబాబా ఆశీస్సులతో తమ జీవితాల్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలని వారు అనుకుంటున్నట్లు కనిపిస్తోంది.
వృతి విషయానికి వస్తే, ఇటీవల నయన్, విఘ్నేశ్ కలిసి 'కాత్తువాకుల రెండు కాదల్' సినిమా చేశారు. విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఈ మూవీలో నయన్‌తో పాటు మరో నాయికగా సమంత నటించింది. తెలుగులో 'కన్మణి రాంబో ఖతీజా' పేరుతో విడుదలైన ఈ సినిమా రెండు చోట్లా డిజాస్టర్‌గా నిలిచింది. కాగా అట్లీ డైరెక్షన్‌లో షారుక్ ఖాన్ సరసన నటించడం ద్వారా త్వరలో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతోంది నయన్.
![]() |
![]() |