![]() |
![]() |

ఈ ఏడాది జూలై 1.. మూడు ఆసక్తికరమైన చిత్రాల మధ్య పోటీకి వేదిక కానుంది. ఈ మూడు కూడా విభిన్న కథాంశాలతో తెరకెక్కుతున్న సినిమాలు కావడం విశేషం.
ఆ వివరాల్లోకి వెళితే.. నక్సలిజం నేపథ్యంలో దగ్గుబాటి రానా, సాయి పల్లవి జంటగా వేణు ఊడుగుల రూపొందించిన ప్రేమకథా చిత్రం `విరాట పర్వం`. ప్రియమణి, నందితా దాస్, ఈశ్వరీ రావ్, నవీన్ చంద్ర, జరీనా వహబ్, నివేదా పెతురాజ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని జూలై 1న రిలీజ్ చేయబోతున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. అయితే, కొద్ది రోజుల క్రితమే ఇదే తేదిని మరో రెండు సినిమాలు టార్గెట్ చేసుకున్నాయి. ఆ సినిమాలే.. `పక్కా కమర్షియల్`, `రంగ రంగ వైభవంగా`. గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న కోర్ట్ డ్రామా `పక్కా కమర్షియల్` ఇదే జూలై 1న తెరపైకి రాబోతుండగా.. వైష్ణవ్ తేజ్, కేతికా శర్మ జోడీగా గిరీశయ్య తీర్చిదిద్దుతున్న రొమాంటిక్ డ్రామా `రంగ రంగ వైభవంగా` కూడా అదే తేదిన ఎంటర్టైన్ చేయనుంది. మరి.. ఈ ముక్కోణపు పోటీలో ఏయే చిత్రాలు విజయపథంలో పయనిస్తాయో తెలియాలంటే జూలై 1 వరకు వేచి చూడాల్సిందే.
![]() |
![]() |