![]() |
![]() |

`ఫిదా`, `ఎంసీఏ` చిత్రాలతో తెలుగునాట బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సొంతం చేసుకుంది డాన్సింగ్ సెన్సేషన్ సాయి పల్లవి. అయితే, ఆ తరువాత వచ్చిన `కణం`, `పడి పడి లేచె మనసు`తో పాటు అనువాద చిత్రాలు `మారి 2`, `ఎన్జీకే` పల్లవిని నిరాశపరిచాయి. దీంతో.. సాయి పల్లవి ఖాతాలో హ్యాట్రిక్ మిస్ అయింది.
కాగా, గత ఏడాది `లవ్ స్టోరి`, `శ్యామ్ సింగ రాయ్` చిత్రాలతో మళ్ళీ రెండు వరుస విజయాలను అందుకుంది ఈ టాలెంటెడ్ యాక్ట్రస్. అదే విధంగా, రెండు సినిమాల్లోనూ అభినయానికి ఆస్కారమున్న పాత్రల్లో కనిపించి అలరించింది.
ఇదిలా ఉంటే, స్వల్ప విరామం అనంతరం `విరాట పర్వం`తో మరోమారు ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమైంది సాయి పల్లవి. నక్సలిజం నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథా చిత్రంలో దగ్గుబాటి స్టార్ రానాకి జోడీగా నటించింది పల్లవి. వేణు ఊడుగుల డైరెక్ట్ చేసిన ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్.. జూలై 1న తెరపైకి రాబోతోంది. మరి.. `ఫిదా`, `ఎంసీఏ` తరువాత వచ్చిన `కణం`తో హ్యాట్రిక్ మిస్ అయిన సాయి పల్లవి.. `లవ్ స్టోరి`, `శ్యామ్ సింగ రాయ్` వంటి హిట్స్ అనంతరం వస్తున్న `విరాట పర్వం`తోనైనా హ్యాట్రిక్ ఫీట్ సాధిస్తుందేమో చూడాలి.
![]() |
![]() |