![]() |
![]() |

శ్రీను వైట్ల కెరీర్‌ను బ్యాడ్ టర్న్ తిప్పిన సినిమాగా మహేశ్ నటించిన 'ఆగడు' పేరు తెచ్చుకుంది. 'దూకుడు' లాంటి బ్లాక్‌బస్టర్ మూవీ చేసిన కాంబో నుంచి వస్తున్న సినిమాగా 'ఆగడు' మేకింగ్‌లో ఉన్నప్పుడు మహా క్రేజ్ తెచ్చుకుంది. తీరా రిలీజయ్యాక మహేశ్ క్యారెక్టరైజేషన్, పేజీలకు పేజీలు అతడు చెప్పే డైలాగులు జనానికి నచ్చలేదు. ఫలితంగా సినిమా డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమాకు ముందే అప్పటిదాకా శ్రీను వైట్లతో ట్రావెల్ అయిన రైటర్ కోన వెంకట్ విడిపోయారు. దాంతో డైలాగ్స్ విషయంలో ఏమాత్రం తగ్గకూడదనీ, తన సత్తా చూపించాలనీ శ్రీను వైట్ల 'ఆగడు'లో మహేశ్‌కు పుంఖానుపుంఖాలుగా డైలాగ్స్ రాసేశారు. చాలా సందర్భాల్లో విలన్లకు పిట్టకథలు చెప్తూ కనిపిస్తాడు మహేశ్. కానీ అది వర్కవుట్ కాలేదు.
మహేశ్‌తో 'ఆగడు'లో ఎక్కువ డైలాగ్స్ ఎందుకు చెప్పించారని ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు శ్రీను వైట్ల సమాధానమిస్తూ, "ఏదో కొత్తదనం కావాలి. చాలా ఎఫర్ట్ పెట్టి, రిథమిక్‌గా, రైమింగ్‌తో ప్రతి డైలాగ్ ఉండాలనే ఉద్దేశంతో వాటిని రాశాం. ఎదుటివాళ్లను బురిడీ కొట్టించడానికి వాళ్లకు కథలు చెప్పడమనేదాన్ని పెట్టాం. అది బాగా వర్కవుట్ అయ్యిందని థియేటర్లలో వచ్చిన రెస్పాన్స్‌ను బట్టి తెలుస్తోంది. చాలా పొడవు డైలాగ్‌తో హీరో ఆ కథ చెబుతుంటాడు. అవన్నీ సింగిల్ షాట్‌లో, బ్రెత్‌లెస్‌గా ఉంటాయి. వాటిని ఓ రైమింగ్‌తో రిథమిక్‌గా మాడ్యులేట్ చేస్తూ చెప్పాలి. అది వెరైటీ అవుతుందని మహేశ్, నేను, మొత్తం యూనిట్ ఫీలయ్యాం. మహేశ్ టెర్రిఫిగ్గా ఆ సీన్లు చేశారు." అంటూ చెప్పుకొచ్చారు. కానీ ఆయన చెప్పిన దానికి విరుద్ధంగా రిజల్ట్ వచ్చిందని మనందరికీ తెలిసిందేగా!
![]() |
![]() |