![]() |
![]() |
.jpg)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురువారం ఉదయం హైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణం చేశారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న 'వకీల్ సాబ్' షూటింగ్ ప్రస్తుతం మియాపూర్ లో జరుగుతోంది. మాదాపూర్ లో మెట్రో ఎక్కి, అమీర్ పేట్ జంక్షన్ లో ట్రైన్ మారి... మియాపూర్ కి పవన్ వెళ్లారు. మధ్యలో తోటి ప్రయాణికులతో మాట్లాడారు. పవన్ మెట్రో ప్రయాణం ఫొటోలు మీడియాకి విడుదల చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అవి చక్కర్లు కొడుతున్నాయి. ఆ ఫొటోల్లో ఒక్క ఫొటో హైలైట్ అని చెప్పాలి.
మాదాపూర్ టు అమీర్ పేట్ మెట్రో రైలు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ మీదుగా వెళుతుంది. చెక్ పోస్ట్ సమీపంలో మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించిన ఐ అండ్ బ్లడ్ బ్యాంకు ఉంది. మెట్రో లోంచి దానిని పవన్ కల్యాణ్ చూస్తుండగా కెమెరా కన్ను క్లిక్ అన్నది. ఆ ఫొటో మెగా అభిమానులకు ఎంతో నచ్చింది.
![]() |
![]() |