![]() |
![]() |

కథానాయికగా ఇప్పటివరకు 18 సినిమాల్లో సందడి చేశారు కీర్తి సురేష్. ఈ ప్రయాణంలో ఎక్కువగా ఒకట్రెండు సినిమాల అనుభవం ఉన్న దర్శకులతోనో.. లేదంటే సీనియర్ కెప్టెన్స్ తోనో కలసి పనిచేశారు కీర్తి. ఇక అప్పుడప్పుడు డెబ్యూ డైరెక్టర్స్ కాంబినేషన్ లోనూ సినిమాలు చేస్తున్నారు. 'రెమో' (తమిళ్), 'పాంబు సట్టై' (తమిళ్)తో పాటు రీసెంట్ గా ఓటీటీలో రిలీజైన 'పెంగ్విన్', 'మిస్ ఇండియా' కోసం నూతన దర్శకులతో జట్టుకట్టారు కీర్తి.
వీటిలో 'రెమో' (దర్శకుడు భాగ్యరాజ్ కన్నన్) మాత్రమే కాస్త ఊరటనిచ్చింది. 'పాంబు సట్టై' (అదమ్ దాసన్), 'పెంగ్విన్' (ఈశ్వర్ కార్తిక్), 'మిస్ ఇండియా' (నరేంద్ర నాథ్).. ఇలా మిగిలిన మూడు సినిమాలు కూడా బోల్తా పడ్డాయి. దీంతో.. కీర్తికి డెబ్యూ డైరెక్టర్స్ అంతగా అచ్చిరావడం లేదని స్పష్టమవుతోంది. మరీ ముఖ్యంగా.. ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ విషయంలో ఈ ఫ్యాక్టర్ అస్సలు వర్కవుట్ కావడం లేదు. మరి.. భవిష్యత్ లోనైనా కీర్తికి కొత్త దర్శకుల కాంబినేషన్స్ తో విజయాలు దక్కుతాయో చూడాలి.
![]() |
![]() |