![]() |
![]() |

సునీల్‌శెట్టి కుమార్తె, బాలీవుడ్ హీరోయిన్ అథియా శెట్టి ఈ రోజు 28వ బర్త్‌డే సెలబ్రేట్ చేసుకుంది. సోషల్ మీడియా ద్వారా ఆమె బ్రదర్ అహన్ శెట్టి నుంచి టైగర్ ష్రాఫ్ సిస్టర్ కృష్ణ దాకా అనేకమంది ఆమెకు బర్త్‌డే విషెస్ తెలియజేశారు. అయితే ఈరోజు ఆమెకు ప్రత్యేకంగా నిలిచేది మాత్రం బాయ్‌ఫ్రెండ్ అయిన కింగ్స్ లెవన్ పంజాబ్ కెప్టెన్ కె.ఎల్. రాహుల్ తెలిపిన శుభాకాంక్షలే. తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ఓ పిక్చర్‌ను షేర్ చేశాడు రాహుల్. అది ఆ ఇద్దరూ సన్నిహితంగా ఉన్నప్పుడు తీసిన సెల్ఫీ. రాహుల్ భుజంపై అథియా తల వాల్చగా, రాహుల్ సెల్ఫీ తీశాడు.
సోషల్ మీడియాలో ఆ పిక్చర్ వైరల్‌గా మారింది. ఆ ఇద్దరి మధ్యా అనుబంధానికి ఆ ఫొటో అద్దం పడుతోందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆ పిక్చర్‌ని షేర్ చేసిన రాహుల్, "హ్యాపీ బర్త్‌డే మ్యాడ్ చైల్డ్" అనే క్యాప్షన్ జోడించాడు. ఆ వెంటనే కామెంట్ల సెక్షన్‌లో ఆనేక కామెంట్లు వెల్లువెత్తాయి. హార్దిక్ పాండ్యా భార్య నటాసా స్టాన్‌కోవిక్ ఒక హార్ట్ ఎమోటికాన్‌ను కామెంట్ సెక్షన్‌లో పెట్టగా, అర్మాన్ జైన్ బిజారే చైల్డ్ అనే కామెంట్ పెట్టి రాహుల్, అథియా ఇద్దర్నీ ట్యాగ్ చేశాడు. కొంతకాలంగా ఆ ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు బాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

![]() |
![]() |