![]() |
![]() |

సూర్య, జ్యోతిక.. అటు రీల్ లైఫ్ లోనూ, ఇటు రియల్ లైఫ్ లోనూ సూపర్ జోడీ. పెళ్ళికి ముందు పలు చిత్రాల్లో అలరించిన ఈ జంట.. పెళ్ళి తరువాత మాత్రం మళ్ళీ కలసి నటించనేలేదు. వివాహానంతరం జ్యోతిక మళ్ళీ సినిమాల్లో పలకరించినా.. ఎక్కువగా ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ లోనే కనిపించారు. దీంతో.. సూర్య, జ్యోతిక కాంబినేషన్‌కు స్కోప్ దొరకలేదు.
అయితే త్వరలోనే ఈ దంపతులు ఓ క్రేజీ వెంచర్ కోసం జట్టుకట్టనున్నారట. వినిపిస్తున్న కథనాల ప్రకారం.. మలయాళ చిత్రం 'బెంగళూరు డేస్'తో సెన్సేషనల్ హిట్ స్కోర్ చేసిన లేడీ డైరెక్టర్ అంజలీ మీనన్ త్వరలో ఓ తమిళ సినిమా చేయబోతున్నారట. ఈ క్రమంలోనే తన సబ్జెక్ట్‌కి సూర్య, జ్యోతిక జోడీ అయితేనే బావుంటుందని ఆమె భావిస్తున్నారట. ఈ మేరకు సూర్య, జ్యోతికతో సంప్రదింపులు కూడా జరుపుతున్నారని కోలీవుడ్ బజ్. త్వరలోనే ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కి సంబంధించిన అఫీషియల్ న్యూస్ వచ్చే ఛాన్స్ ఉందని టాక్.
మరి..ఒకటిన్నర దశాబ్దం తరువాత వెండితెరపై జంటగా వెలుగులు పంచబోతున్న సూర్య, జ్యో.. మరోమారు ఆ మ్యాజిక్ ని కొనసాగిస్తారేమో చూడాలి.
![]() |
![]() |