![]() |
![]() |

గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మం ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగవుతోంది. కొవిడ్ 19 బారిన పడి దాదాపు నెల రోజులుగా చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఆయనకు ఈ రోజు టెస్ట్‌లో కొవిడ్ 19 నెగటివ్‌గా నిర్ధారణ అవడంతో ఆయన అభిమానులు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆయనకు ఇప్పటికీ వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నట్లు కుమారుడు ఎస్పీ చరణ్ తెలిపారు. కరోనా వైరస్ కారణంగా ఇన్‌ఫెక్షన్‌కు గురైన ఆయన ఊపిరితిత్తులు ఇంకా సాధారణ స్థితికి రాలేదనీ, అందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని వైద్యులు తెలిపారనీ చరణ్ చెప్పారు.
ఈ వారాంతానికి ఆయన పరిస్థితి మరింత మెరుగుపడుతుందని ఆశిస్తున్నామన్నారు. అలాగే, ప్రస్తుతం ఆయన పూర్తి స్పృహలో ఉన్నారనీ, తనకిష్టమైన క్రికెట్, టెన్నిస్ ఆటలను ఐపాడ్‌లో చూస్తున్నారని చరణ్ తెలిపారు. గత వారాంతం తమ తల్లిదండ్రుల మ్యారేజ్ డేని సెలబ్రేట్ చేసుకున్నామని కూడా ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ప్రస్తుతం తమ తండ్రికి ఎలాంటి మత్తు మందులు ఇవ్వడం లేదనీ, ఫిజియో థెరపీ మాత్రం కొనసాగుతోందనీ చరణ్ చెప్పారు.
![]() |
![]() |