![]() |
![]() |

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్, దుండిగల్ సమీపంలోని ఖాజీపల్లి అర్బన్ ఫారెస్ట్‌కు చెందిన 1650 ఎకరాల అటవీ భూమిని బాహుబలి ప్రభాస్ దత్తత తీసుకున్నాడు. సోమవారం సాయత్రం ఖాజీపల్లి అర్బన్ ఫారెస్ట్ పార్క్‌కు తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖా మంత్ర ఇంద్రకరణ్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రచారంతో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ఎంపీ సంతోష్‌కుమార్ చొరవతో ఈ పార్క్‌ను ప్రభాస్ దత్తత తీసుకున్నాడు.

తన తండ్రి యు.వి. సూర్యనారాయణరాజు పేరు మీద ఈ పార్కును, అటవీ ప్రాంతాన్నీ అభివృద్ధి చేయనున్నట్లు ప్రభాస్ తెలిపాడు. దీంతో ఔటర్ రింగ్ రోడ్డు వెంట మరో అర్బన్ ఫారెస్ట్ పార్క్ అందుబాటులోకి రానున్నది.

దీని కోసం తొలి విడతగా రూ. 2 కోట్లను ప్రభాస్ అందజేశాడు. అవసరాన్ని బట్టి మరింత ఖర్చు పెట్టేందుకు సిద్ధమని తెలిపాడు. ఈ సందర్భంగా పార్క్‌లో ఆయన మొక్కలు నాటాడు.
.jpg)
![]() |
![]() |