![]() |
![]() |

ఫైర్‌బ్రాండ్ యాక్ట్రెస్ కంగనా రనౌత్‌కు వై-ప్లస్ భద్రతను కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. ఈ భద్రతను ఆమెకు సీఆర్‌పీఎఫ్ కల్పించనున్నది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో ఆమె చేసిన పరిశీలనలు, వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా మహారాష్ట్రకు చెందిన కొంతమంది రాజకీయనాయకుల బెదిరింపు ప్రకటనల నేపథ్యంలో కంగన నివసిస్తున్న, పనిచేస్తున్న ప్రదేశాలలో ఆమెకు భద్రతను కల్పించాలని కేంద్ర నిర్ణయించింది.
వై-ప్లస్ భద్రత ప్రకారం కంగనకు అన్ని వేళలా ఇద్దరు సీఆర్‌పీఎఫ్ కమాండోలు రక్షణగా ఉంటారు. ఒక సీఆర్‌పీఎఫ్ ఉద్యోగి ఎప్పుడూ ఆమె నివాసం దగ్గర కాపలా ఉంటాడు. అంటే ముగ్గురు ఉద్యోగులు షిఫ్ట్‌ల వారీగా 24 గంటల సేపు ఆమె ఇంటి వద్ద కావలి కాస్తుంటారు. ఇలా షిఫ్ట్‌ల ప్రకారం మొత్తం 11 మంది సీఆర్‌పీఎఫ్ సిబ్బంది ఆమెకు సెక్యూరిటీగా నిలుస్తారు. వీరిలో ఐదుగురు స్టాటిక్ గార్డులు, ఆరుగురు కమాండోలు. వీరందరూ అధునాతన ఆటోమాటిక్ ఆయుధాలతో కంగనకు వ్యక్తిగతంగా భద్రతను కల్పిస్తుంటారు. తనకు వై-ప్లస్ భద్రతను కల్పిస్తున్నందుకు కేంద్ర హోమ్ మంత్రి అమిత్‌షాకు కంగన కృతజ్ఞతలు తెలిపింది.
![]() |
![]() |