![]() |
![]() |

మొన్న తండ్రి నాగార్జున 'వైల్డ్ డాగ్' మూవీ షూటింగ్ పునఃప్రారంభించగా, ఇప్పుడు తనయుడు నాగచైతన్య 'లవ్ స్టోరి' షూటింగ్ సెట్స్‌పై అడుగు పెట్టాడు. చైతన్య, సాయి పల్లవి జంటగా సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తీస్తున్న ‘లవ్ స్టోరీ’ చివరి షెడ్యూల్ షూటింగ్ మొదలైంది. కొవిడ్ అంతరాయం వల్ల వాయిదా పడ్డ షూటింగ్ ఈ రోజు నుండి 15 రోజుల ఏకధాటిగా షూటింగ్ చేసి సినిమాను కంప్లీట్ చేయనున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సహ నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కె. నారంగ్, పి. రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, ‘‘లాక్ డౌన్ వల్ల వాయిదా పడ్డ మా ‘లవ్ స్టోరి’ షూటింగ్ ను ఈ రోజు నుంచి మళ్లీ మొదలు పెడుతున్నాం. ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలు అన్నీ పాటిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ షూట్ చేస్తున్నాం. లొకేషన్ లో కేవలం 15 మంది ఉండేలా చూసుకుంటున్నాం. షూటింగ్ లో పాల్గొనేవారందరికీ ముందే కరోనా టెస్ట్ లు నిర్వహించాం. యూనిట్ మెంబర్స్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యేదాకా ఇంటికి వెళ్లకుండా లొకేషన్ దగ్గరే ఉండేలా ఏర్పాట్లు చేశాం. మాస్కులు, శానిటైజర్ లు వాడుతూ, సామాజిక దూరం పాటిస్తూ షూటింగ్ చేస్తున్నాం. 15 రోజుల పాటు నాన్ స్టాప్ గా షూట్ చేసి సినిమాను కంప్లీట్ చేస్తాం. సరైన సమయం చూసుకుని సినిమాను థియేటర్లలో విడుదల చేస్తాం" అన్నారు.


![]() |
![]() |