![]() |
![]() |

నితిన్ హీరోగా నటిస్తున్న 'రంగ్ దే'కు డిజిటల్ నుండి భారీ ఆఫర్లు వస్తున్నాయట. అయితే, రేటు దగ్గర ఏకాభిప్రాయం కుదరక డీల్ క్లోజ్ కావడం లేదని టాక్. వరుణ్ తేజ్ 'తొలిప్రేమ', అఖిల్ అక్కినేని 'మిస్టర్ మజ్ను' సినిమాలు తీసిన వెంకీ అట్లూరి ఈ సినిమాకి దర్శకుడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అనుబంధ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. కీర్తీ సురేష్ హీరోయిన్. దీనికి మంచి బజ్ ఉంది.
నితిన్ లాస్ట్ సినిమా 'భీష్మ' థియేటర్లలో బాగా ఆడింది. అందులో మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది. ఆల్రెడీ రిలీజ్ అయిన 'రంగ్ దే' టీజర్ కేసుల ఎంటర్టైన్మెంట్‌కు లోటు లేదనే విషయాన్ని చెప్పకనే చెప్పింది. అందుకని, ఈ సినిమా మీద ఓటీటీ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. అందులో 'జీ 5' ముందున్నదని టాక్. సినిమాకు అవుట్ రేట్ కాకుండా బడ్జెట్ మీద 20 శాతం ఎక్కువ ఇస్తామని ఆఫర్ చేశారట. నిర్మాతలు ఆలోచిస్తున్నారని టాక్.
'భీష్మ' హిట్ కారణంగా బడ్జెట్ తో సంబంధం లేకుండా 'రంగ్ దే'కి థియేట్రికల్ రైట్స్ బాగా పలికే అవకాశం ఉంది. శాటిలైట్, డిజిటల్ రైట్స్ ఎలాగో వస్తాయి. అవి లెక్కలు వేసుకుని నిర్మాతలు ఏ విషయం చెప్పాలని అనుకుంటున్నారట.
![]() |
![]() |