![]() |
![]() |

ఈ రోజుల్లో దివంగత సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్‌తో అంకితా లోఖండే గత బంధం టాక్ ఆఫ్ ద టౌన్. అయినప్పటికీ ఆమె ప్రస్తుత బంధంపై అది ఎలాంటి నెగటివ్ ప్రభావాన్నీ కలిగించకపోవడం గమనార్హం. సుశాంత్‌తో బంధం ముగిశాక ఆమె బిజినెస్‌మ్యాన్ విక్కీ జైన్‌తో డేటింగ్ చేస్తూ వస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో అంకితకు విక్కీ సపోర్టివ్‌గా ఉంటూ వస్తున్నాడు. పరస్పరం సపోర్ట్ చేసుకుంటూ, ప్రేమలో మునిగి తేలుతూ, ఒకరి కోసం ఒకరన్నట్లు వారిద్దరూ గడుపుతున్నారు. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో అంకిత షేర్ చేసిన వీడియో దానికి నిదర్శనం.
కామన్ ఫ్రెండ్స్ ద్వారా విక్కీ, అంకిత ఒకరికొకరు పరిచయమై, త్వరలోనే ప్రేమలో పడ్డారు. తన 34వ బర్త్‌డే పార్టీకి విక్కీని అంకిత ఆహ్వానించినప్పుడు, ఆ ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్ గురించి గుసగుసలు మొదలయ్యాయి. వాళ్లిద్దరి పిక్చర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, తమ రిలేషన్‌షిప్‌ను అంకిత బహిర్గతం చెయ్యకపోయినా, ప్రేమ దాచాలన్నా దాగదు కదా. గత ఏడాది, సినిమా స్టైల్లో అంకితకు ప్రపోజ్ చేశాడు విక్కీ.

సోషల్ మీడియాలో కానీ, బయట కానీ ఆ ఇద్దరికీ అభిమాన గణం ఎక్కువగానే ఉన్నారు. వాళ్లిద్దరి పేర్లతో పలు ఫ్యాన్ అకౌంట్లు కూడా సోషల్ మీడియాలో నడుస్తున్నాయి. అలా ఓ ఫ్యాన్ పేజిలో పెట్టిన రెండు వీడియో పోస్టులను తన ఇన్‌స్టా స్టోరీలో అంకిత షేర్ చేసింది. ఒక వీడియోలో ఆ ఇద్దరూ కలిసున్న పిక్చర్లు ఉండగా, ఇంకో దాంట్లో 'రాకీ హ్యాండ్సమ్' మూవీలోని 'రెహ్‌నుమా..' సాంగ్ ప్లే అవుతున్న అంకిత-విక్కీ పిక్చర్ ఉంది.

![]() |
![]() |