![]() |
![]() |

తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక వ్యక్తిగా వచ్చి శక్తిగా ఎదిగిన కథానాయకులలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. ఎన్టీఆర్, ఏయన్నార్ తర్వాత తరంలో టాప్ స్టార్స్‌లో ఆయన ఒకరు. బహుశా... ఇండియన్ సినిమా హిస్టరీలో మెగా ఫ్యామిలీ నుండి వచ్చినంత మంది హీరోలు, ఏ కుటుంబం నుండి రాలేదేమో. ఎంతో మంది సినిమా ఇండస్ట్రీకి రావడానికి స్ఫూర్తిగా నిలిచిన మెగాస్టార్ జీవితం మీద సినిమా వస్తే? రావాలని కోరుకునే అభిమానుల సంఖ్య ఎక్కువే. 'మెగా' బయోపిక్ కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. అందులోనూ ప్రస్తుతం చిరంజీవి ఆటోబయోగ్రఫీ (ఆత్మకథ) రాస్తున్న తరుణంలో, తర్వాతి కాలంలో అది సినిమాగా వస్తుందమోనని కొందరిలో ఒక ఆశ ఉంది.
మెగాస్టార్ మాత్రం "బయోపిక్ విషయానికి వస్తే... నా జీవితంలో అందుకు తగ్గట్టు ఆసక్తికరమైన మలుపులు ఉన్నాయని నేను అనుకోవడం లేదు" అని అన్నారు. అయితే, తన వ్యక్తిగత జీవితంలో ముచ్చట్లతో కూడిన డాక్యుమెంటరీ తీసుకు రావడానికి ప్లాన్ చేస్తున్నట్టు చిరంజీవి తెలిపారు. తమకు చిరంజీవి కావాలని ఉందని ఔత్సాహిక నటులు చెప్పడం సంతోషంగా అనిపిస్తుంటుందని ఆయన తెలిపారు. ఒకవేళ చిరంజీవి బయోపిక్ వస్తే... అందులో యంగ్ చిరుగా రామ్ చరణ్ నటిస్తే బాగుంటుందని అభిమానుల కోరిక.
![]() |
![]() |