![]() |
![]() |

కొవిడ్-19 వార్డ్ నుంచి సోమవారం అమితాబ్ బచ్చన్ కొన్ని భావాలను పంచుకున్నారు. కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో జూలై 11న ముంబైలోని నానావతి హాస్పిటల్‌లో ఆయన చికిత్స పొందుతూ వస్తున్నారు. "శత్రువులను సంపాదించడానికి గొడవపడటం తప్పనిసరేమీ కాదు.. కొంచెం సక్సెస్ అవ్వండి చాలు.. అత్యల్ప కాలంలోనే మీరు వాళ్లను పొందుతారు" అని ఒక ఫొటోతో పాటు ట్వీట్ చేశారు అమితాబ్. కిస్ ఫిల్టర్‌ను ఉపయోగించిన ఆ ఫొటోలో బిగ్ బి ముఖం నిండా ముద్దులు పెట్టినట్లు లిప్‌స్టిక్ పెదాల గుర్తులున్నాయి.
అంతకు ముందు ఆయన, "జీవితంలో సవాళ్లు ఎదురవడం అనివార్యం, ఓడిపోతూ రావడమనేది ఐచ్ఛికం" అని రాశారు. హాస్పిటల్‌లో చేరినప్పట్నుంచీ తన ఆరోగ్య స్థితినీ, తన భావాలను పంచుకుంటూ వస్తున్నారు అమితాబ్. అదే హాస్పిటల్‌లో ఆయన కుమారుడు అభిషేక్, కోడలు ఐశ్వర్య, మనవరాలు ఆరాధ్య సైతం కొవిడ్-19కు చికిత్స పొందుతున్నారు. జూలై 11న అమితాబ్, అభిషేక్‌లకు కరోనా సోకినట్లు వెల్లడవగా, ఆ మరుసటి రోజు ఐశ్వర్య, ఎనిమిదేళ్ల ఆరాధ్య కూడా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు. మొదట హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నతల్లీకూతుళ్లకు.. ఆ తర్వాత లక్షణాలు బయటపడటంతో హాస్పిటల్‌లో చేరారు. అప్పట్నుంచీ వాళ్లంతా చికిత్స పొందుతూనే ఉన్నారు.

![]() |
![]() |