![]() |
![]() |

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్‌కు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అని పేరుంది. ఆయన ఏ పాత్రను పోషిస్తే అందులో జీవిస్తారని అంటారు. ప్రస్తుతం ఆమిర్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'లాల్ సింగ్ చద్దా'. ఇందులో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ అతిథి పాత్రలో నటించారని ముంబై సినీ వర్గాల కథనం. మరో విశేషం ఏమిటంటే...
షారుక్ అతిథి పాత్రల్లో నటించిన సన్నివేశాలకు ఆమిర్ ఖాన్ దర్శకత్వం వహించారట. బాలీవుడ్ సూపర్ స్టార్‌ని మరో స్టార్ దర్శకత్వం వహించడం సంథింగ్ స్పెషల్ మూమెంట్ కదా!
షారుక్ అతిథి పాత్ర వార్త ఆయన అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఎందుకంటే... వెండితెరపై బాలీవుడ్ బాద్‌షా కనిపించే సుమారు రెండేళ్లు అవుతోంది. 'జీరో' పరాజయం తర్వాత ఆయన మరో సినిమా అంగీకరించలేదు. పెంచిన చిత్రాలన్నీ వరుసగా పరాజయాలు అవుతుండడంతో అంతర్మథనంలో పడ్డారు. కనీసం అతిథి పాత్రలోనైనా చూడొచ్చని షారుఖ్ అభిమానులు సంతోషిస్తున్నారు.
![]() |
![]() |