![]() |
![]() |

కలెక్షన్ కింగ్ డాక్టర్ మంచు మోహన్ బాబు మనవరాలు, విష్ణు మంచు చిన్న కూతురు ఐరా విద్య ఈరోజు పాఠశాలకు వెళ్లారు. స్కూల్లో బుజ్జి పాపాయికి ఇదే తొలి రోజు. చిన్నారి పాఠశాలకు వెళుతున్న ఫోటోలను విష్ణు వైఫ్ విరానికా ఇంస్టాగ్రామ్ స్టోరీలలో పోస్ట్ చేశారు.
"నా చిన్నారి ఐరాకు ఈరోజు ప్రైవేట్ క్లాసులు. తనకు స్కూల్లో ఫస్ట్ డే" అని విరానికా మంచు పేర్కొన్నారు. తన చిన్న బ్యాగును చూడండి అని మరొక పోస్ట్ చేశారు. బ్యాగు తీయడానికి ఐరా ఒప్పుకోలేదట. క్లాసులు బ్యాగు వేసుకుని విన్నదని విరానికా చెప్పుకొచ్చారు. ఫోటోలలో కుమార్తెతో మంచు విష్ణుని కూడా చూడొచ్చు.




![]() |
![]() |