![]() |
![]() |

బాలీవుడ్ ఖిలాడి అక్షయ్ కుమార్ కథానాయకుడిగా నటించిన కొత్త సినిమా 'లక్ష్మీ' ఈ నెల 9న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. విమర్శకుల నుండి మెజారిటీ ప్రేక్షకులనుండి సినిమాకి నెగెటివ్ టాక్ వచ్చింది. చాలామంది ఫ్లాప్ అని తేల్చేశారు. అయితే ఈ సినిమా రికార్డులు బద్దలు కొట్టింది అని ఓటీటీ వేదిక ప్రకటించింది.
"డిస్నీ ప్లస్ హాట్ స్టార్ విఐపిలో బిగ్గెస్ట్ ఓపెనింగ్ మూవీగా 'లక్ష్మీ' నిలిచింది. అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. బ్లాక్బస్టర్ మూవీ ఆఫ్ ద ఇయర్ 'లక్ష్మీ'ని చూసిన సబ్స్క్రైబర్స్ అందరికీ థాంక్యూ" అని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ పోస్ట్ చేసింది. మరోవైపు అక్షయ్ కుమార్ కూడా సినిమాకు వస్తున్న స్పందన తనకు ఆనందాన్ని కలిగించిందని చెప్పారు.
ఈ సినిమా రాఘవ లారెన్స్ కథానాయకుడిగా నటించి, దర్శకత్వం వహించిన 'కాంచన'కు హిందీ రీమేక్. హిందీతో పోలిస్తే సౌత్ సినిమా బాగుందని చాలా మంది కామెంట్లు చేశారు. అక్షయ్ కంటే లారెన్స్ చాలా బాగా చేశాడన్నారు.
![]() |
![]() |