![]() |
![]() |

అభిమానులకు, ప్రేక్షకులకు మహేష్ బాబు ఒక సూపర్ స్టార్. కానీ, మంజులకు మాత్రం ఒక బ్రదర్. ప్రేక్షకులకు మహేష్ ఒక హీరోగా తెలిస్తే... ఆమెకు చిన్నతనం నుంచి తెలుసు. చాలా దగ్గరగా తెలుసు. ప్రేక్షకులకు ఎవరికీ తెలియని మహేష్ లో మరో కోణాన్ని తాజా ఇంటర్వ్యూలో మంజుల బయటపెట్టారు.
"మహేష్ చాలా పుస్తకాలు చదువుతాడు. అనేక విషయాల గురించి లోతుగా ఆలోచిస్తాడు. మహేష్, నేను కలిస్తే... ఎక్కువగా ఆధ్యాత్మిక, వ్యక్తిత్వ వికాస అంశాల గురించి మాట్లాడుకుంటాం" అని మంజుల చెప్పారు. దాంతో మహేష్ లో ఆధ్యాత్మిక కోణం కూడా ఉందని ప్రేక్షకులకు అర్థం అయింది.
"నేను ఓ సమయంలో ఆధ్యాత్మికం వైపు మళ్లితే... ఆత్మే కాదు, ఆలోచనలు ముఖ్యమని మహేష్ నాకు చెప్పాడు. టోనీ రాబిన్స్ రాసిన ఓ పుస్తకం నాకు ఇచ్చాడు. అప్పటినుండి నా ఆలోచనా విధానమే మారిపోయింది. నేను ఎంతో కష్టపడి నేర్చుకున్న విషయాలను సున్నితంగా, సులభంగా అర్థం చేసుకుని అందులో కొన్ని మార్పులు సూచించాడు. ఓ ఈ విధంగా మహేష్ నాకు గురువు" అని మంజుల వివరించారు.
![]() |
![]() |