![]() |
![]() |

మన సినిమా తారల్లో చాలా అంటే చాలా మంది మూగజీవాలపై ఎంతో ప్రేమ చూపిస్తారు. పిల్లల్లో కుక్క పిల్లలను పెంచుకుంటారు. ఆ మాటకు వస్తే... మూగజీవాలు అంటే ఎవరికి ప్రేమ ఉండదు చెప్పండి? చాలా మంది సాధారణ ప్రజల ఇళ్లలోని పెంపుడు కుక్కలు కనిపిస్తాయి. అందుకు సెలబ్రిటీలు అతీతమేమీ కాదు.
రామ్ చరణ్, సమంత, విజయ్ దేవరకొండ, నాగశౌర్య, రాజ్ తరుణ్ లాంటి తారల దగ్గర పెంపుడు జంతువులు ఉన్నాయి. యువ హీరో సుధీర్ బాబు పెంపుడు జంతువులను పెంచుకుంటున్న సెలబ్రిటీల జాబితాలో ఉన్నారు. తాజాగా ఆయన బుల్లి బుజ్జి కుక్క పిల్లని ఇంటికి తెచ్చుకున్నారు. దానికి ఇంకా పేరు పెట్టలేదని తెలిపారు. ఏం పేరు పెడితే బాగుంటుందో చెప్పమని నెటిజన్లను అడిగారు. సలహాలు స్వీకరిస్తానని చెప్పారు.
సుధీర్ బాబు బుజ్జి కుక్క పిల్లతో ఒక వీడియో పోస్ట్ చేయగా... 'ఓ మై గాడ్ క్యూటీ' అని హీరోయిన్ లావణ్య త్రిపాఠి స్పందించారు. మహేష్ బాబు సోదరి, సుధీర్ బాబుకు వదిన అయిన మంజుల 'చాలా ముద్దుగా ఉంది' అని కామెంట్ చేశారు.
![]() |
![]() |