![]() |
![]() |

రెండేళ్ల క్రితం 53 సంవత్సరాల ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి ఆత్మహత్యకు సంబంధించిన కేసులో ప్రమేయం ఉందనే ఆరోపణలపై అరెస్టయిన అర్ణబ్ గోస్వామికి 'అతిథి' హీరోయిన్ అమృతా రావ్ నుంచి మద్దతు లభించింది.
తన ట్విట్టర్ హ్యాండిల్‌లో అర్ణబ్ విడుదల కోసం జరుగుతున్న ఉద్యమంలో మద్దతు కోరుతూ రిపబ్లిక్ టీవీ పోస్ట్ చేసిన ఓ వీడియోకు అమృత స్పందించింది. ఇటీవలే తొలి బిడ్డకు జన్మనిచ్చిన అతిథి హీరోయిన్ అర్ణబ్‌ను వెనకేసుకొచ్చింది. ట్విట్టర్‌లో చలామణీలో ఉన్న మూడు హ్యాష్‌ట్యాగ్‌లను పోస్ట్ చేసింది. రిపబ్లిక్ పోస్ట్‌ను రిట్వీట్ చేసిన ఆమె.. 'ఇండియా విత్ అర్ణబ్ గోస్వామి', 'అర్ణబ్ లైఫ్ అండర్ థ్రెట్', 'వియ్ వాంట్ అర్ణబ్ బ్యాక్' అనే మూడు హ్యష్‌ట్యాగ్స్‌ను ఉపయోగించింది.
అమృతా రావ్‌తో పాటు నటి, పార్లమెంట్ సభ్యురాలు రూపా గంగూలీ, మరో తార షెర్లీన్ చోప్రా సైతం అర్ణబ్‌కు మద్దతుగా నిలిచారు.

![]() |
![]() |