![]() |
![]() |

మూడు సంవత్సరాలుగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' సినిమా మన ముందుకు వచ్చేసింది. 'బాహుబలి' ఫ్రాంచైజ్ తర్వాత యస్.యస్. రాజమౌళి సినిమా కావడం, అందులోనూ మాస్‌లో సమాన ఇమేజ్ వున్న ఇద్దరు స్టార్ హీరోలు రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించడంతో 'ఆర్ఆర్ఆర్'పై వెల్లువెత్తిన అంచనాలకు హద్దులు లేకుండా పోయాయి. అందుకు అనుగుణంగానే బాక్సాఫీస్ దగ్గర ఫస్ట్ డే 'ఆర్ఆర్ఆర్ అసాధారణ కలెక్షన్లను రాబట్టినట్లు ట్రేడ్ విశ్లేషకులు తెలియజేస్తున్నారు.
మొదటిరోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజమౌళి ప్రీవియస్ ఫిల్మ్ 'బాహుబలి 2' పేరిట ఉన్న రికార్డును తుడిచిపెట్టి సరికొత్త బెంచ్‌మార్క్‌ను నెలకొల్పింది. 'ఆర్ఆర్ఆర్' ఫస్ట్ డే తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ఏరియాల్లో ఏకంగా రూ. 74.11 కోట్ల షేర్‌ను సాధించి, ట్రేడ్ వర్గాల మైండ్ బ్లాక్ చేసింది. 'బాహుబలి 2' ఫస్ట్ డే రాబట్టింది రూ. 43 కోట్లు. అంటే ఎంత మార్జిన్‌తో ఆ రికార్డును 'ఆర్ఆర్ఆర్' బ్రేక్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఒక పెద్ద సినిమా ఓవరాల్‌గా సాధించే కలెక్షన్లను 'ఆర్ఆర్ఆర్ తొలిరోజే సాధించేయడం ఏ రకంగా చూసినా అసాధారణమే!
ఇద్దరు స్వాతంత్ర్య పోరాట వీరులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌లను కల్పిత కథలో భాగం చేయడం అనే ఒక అసాధారణ అంశంతో రాజమౌళి కల్పించిన ఈ వెండితెర అద్భుతం మొదటిరోజు తెలంగాణలో రూ. 23.35 కోట్లు, ఆంధ్రలో రూ. 33.76 కోట్లు, రాయలసీమలో రూ. 17 కోట్లు.. వెరసి మొత్తం రూ. 74.11 కోట్ల షేర్‌ను కొల్లగొట్టింది. ఈ ఏరియాలో 'ఆర్ఆర్ఆర్' ప్రి బిజినెస్ వాల్యూ రూ. 191 కోట్లు. అంటే.. మొదటి రోజే దాదాపు 39 శాతం రికవరీని రాజమౌళి సినిమా సాధించేసింది. ఆంధ్రలో 40 శాతం, తెలంగాణలో 33 శాతం, రాయలసీమలో 46 శాతం (సుమారు) రికవరీ అయ్యింది.
ఇదివరకు విడుదలైన మొదటిరోజు 'సైరా' సినిమా రూ. 38.75 కోట్లు, 'సాహో' మూవీ 36.52 కోట్లు, 'సరిలేరు నీకెవ్వరు' సినిమా రూ. 32.77 కోట్లు, 'వకీల్ సాబ్' ఫిల్మ్ రూ. 32.24 కోట్ల షేర్‌ను కలెక్ట్ చేశాయి. రామరాజుగా రామ్‌చరణ్, కొమరం భీమ్‌గా జూనియర్ ఎన్టీఆర్.. ట్రెమండస్ పర్ఫార్మెన్స్‌లతో అదరగొట్టగా, సెంథిల్‌కుమార్ కెమెరా విన్యాసాల సాయంతో రాజమౌళి తీసిన ఈ విజువల్ వండర్ రానున్న రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర మరిన్ని వండర్స్‌ను సాధించడం ఖాయమనడంలో డౌటే లేదు.
![]() |
![]() |