![]() |
![]() |

ధనుష్, సాయిపల్లవి డాన్స్ చేసిన 'రౌడీ బేబీ' సాంగ్ క్రేజ్‌కు ఎదురు లేనట్లు కనిపిస్తోంది. 'మారి 2' మూవీ ఆడియో విడుదలైనప్పుడే 'రౌడీ బేబీ' సాంగ్ బ్లాక్‌బస్టర్ హిట్టయి, ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. టిక్ టాక్ దగ్గర్నుంచీ అనేక యాప్‌లలో అది విరివిగా ప్రచారంలోకి వచ్చింది. 'మారి '2 మూవీ రిలీజయ్యి ఏడాదిన్నర పైగా అయ్యింది. అయినప్పటికీ 'రౌడీ బేబీ' సాంగ్ ఇప్పటికీ అభిమానులను అలరిస్తూనే ఉంది. యూట్యూబ్‌లో అది 900 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి, సౌత్‌లోనే ఆ ఫీట్ సాధించిన ఏకైక సాంగ్‌గా రికార్డులలోకి ఎక్కింది. దాని దెబ్బకు బాలీవుడ్‌లోని అనేక పాటల రికార్డులు కూడా తుడిచిపెట్టుకుపోయాయి.
యువన్‌శంకర్ రాజా మ్యూజిక్, ప్రభుదేవా కొరియోగ్రఫీ, సాయిపల్లవి-ధనుష్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆ సాంగ్ అద్భుత విజయం సాధించింది. అతి త్వరలోనే ఆ పాట 1000 మిలియన్ వ్యూస్ సాధిస్తుందని సంగీతప్రియులు, అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. టిక్‌టాక్‌లో ఈ పాటకు స్టెప్పులేసిన వాళ్లలో సాధారణ వ్యక్తుల నుంచి సెలబ్రిటీల దాకా ఉన్నారు. అందువల్లే 'రౌడీ బేబీ' సాంగ్‌కు ఇంత పాపులారిటీ వచ్చింది.
![]() |
![]() |