![]() |
![]() |

ఇతరుల్ని వేలెత్తి చూపే ముందు ఒకటికి నాలుగుసార్లు ఆలోచించుకోమని పెద్దలు చెబుతారు. ఎందుకంటే... ఇతరులపై ఒక వేలు చూపిస్తే.... నాలుగువేళ్ళు మనల్ని చూపెడతాయని! ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ విషయంలో అదే జరుగుతున్నట్టు ఉంది. పవన్ కళ్యాణ్ ని వేలెత్తి చూపెడుతూ 'పవర్ స్టార్' అని రామ్ గోపాల్ వర్మ ఒక సెటైరికల్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికలలో పవన్ ఓటమిని వెటకారం చేస్తూ ఆ సినిమా తీస్తున్నారని పోస్టర్లు, ప్రచార చిత్రాలు చూస్తే తెలుస్తోంది. వర్మ వ్యవహారం పవన్ అభిమానులకు చిర్రెత్తుకు వచ్చేలా చేసింది. దాంతో వర్మను టార్గెట్ చేస్తూ వరుస సినిమాలు ప్రకటిస్తున్నారు.
'బిగ్ బాస్' ఫేమ్ నూతన్ నాయుడు మెగాఫోన్ పడుతూ... 'పరాన్నజీవి' సినిమా ప్రకటించాడు. ఆల్రెడీ ఇందులో ఒక సాంగ్ విడుదల చేశారు కూడా. అది వింటే వర్మను ఎటాక్ చేసినట్టు తెలుస్తుంది. మరో పవన్ అభిమాని 'పార్న్ జీవి' సినిమా ప్రకటించాడు. గతంలో వర్మ దగ్గర 'సర్కార్ 3'కి పని చేసిన జయకుమార్ 'వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ టాలీవుడ్: ఫ‌్లాప్ డైరెక్టర్' అని ఇంకో సినిమా తీస్తున్నారు. ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు.
టాలీవుడ్ కమెడియన్, జబర్దస్త్ కంటెస్టెంట్ షకలక శంకర్ కూడా వర్మకు వ్యతిరేకంగా, పవన్ కళ్యాణ్ అభిమానులకు మద్దతుగా 'డేరా బాబా' సినిమా తీస్తున్నాడు. దీని ప్రోమో కూడా బయటకు వచ్చింది. వర్మను డిట్టో దించడంలో షకలక శంకర్ ఎక్స్‌పర్ట్. ఆల్రెడీ రిలీజ్ చేసిన ప్రోమోలో బూతు సినిమాలు అంటూ డైరెక్టుగా వర్మ మీద సెటైర్ వేశాడు.
ఆర్జీవీ 'పవర్ స్టార్'తో పాటు ఆర్జీవీకి వ్యతిరేకంగా వస్తున్న సినిమాలు కూడా సగటు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. విడుదలైన తరవాత ఎవరి సినిమా ఎలా ఉంటుందో తెలుస్తుంది.
![]() |
![]() |