![]() |
![]() |

'పెళ్ళిచూపులు'తో తెలుగు చిత్ర పరిశ్రమ దృష్టిని ఆకర్షించిన కథానాయిక రీతూ వర్మ. చిత్ర పాత్రలో ఒదిగిపోయి.. ఉత్తమ నటిగా నంది పురస్కారానికి సైతం ఎంపికైంది ఈ అచ్చ తెలుగందం. ఆ తరువాత కోలీవుడ్ పై దృష్టి సారించిన ఈ టాలెంటెడ్ బ్యూటీ.. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో బిజీ హీరోయిన్ అయిపోయింది.
ఈ అమ్మడి చేతిలో ఇప్పుడు 'ధ్రువ నక్షత్రం' (తమిళ్), 'టక్ జగదీష్', 'వరుడు కావలెను', 'నిన్నిలా నిన్నిలా', పేరు నిర్ణయించని శర్వానంద్ ద్విభాషా చిత్రం.. ఇలా ఐదు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కాగా, వీటిలో రెండు సినిమాలు వేసవిలో సందడి చేయనున్నాయి. ఆ చిత్రాలే.. 'టక్ జగదీష్', 'వరుడు కావలెను'.
ఏప్రిల్ 16న 'టక్ జగదీష్' విడుదల కానుండగా.. మే నెలలో 'వరుడు కావలెను' తెరపైకి రాబోతోంది. మరి.. ఈ చిత్రాలతో రీతూ వర్మ ఎలాంటి గుర్తింపుని సంపాదించుకుంటుందో చూడాలి.
![]() |
![]() |