![]() |
![]() |

'హిట్' మూవీతో హిట్ సాధించిన విష్వక్ సేన్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ 'పాగల్'. మ్యాజికల్ లవ్ స్టోరీగా నరేశ్ కుప్పిలి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. దిల్ రాజు సమర్పిస్తోన్న ఈ మూవీని లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు.
ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ రోజు 'పాగల్' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. దాంతో పాటు ఈ ఏప్రిల్ 30న మూవీని రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. పోస్టర్‌లో విష్వక్ సేన్ ఉబర్‌కూల్ లుక్‌లో డాన్స్ మూవ్‌మెంట్‌తో కనిపిస్తున్నాడు. బ్యాగ్రౌండ్‌లో గులాబిపూలు కనిపిస్తుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒక స్వచ్ఛమైన లవ్ స్టోరీగా 'పాగల్' రూపొందుతోందనే సంకేతాన్ని ఇస్తోంది ఈ పోస్టర్.
ఈ మూవీలో హీరోయిన్ ఎవరనేది ఇంతవరకూ ప్రకటించలేదు. రధన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి ఎస్. మణికందన్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు.

సాంకేతిక వర్గం:
బేనర్స్: శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, లక్కీ మీడియా
సమర్పణ: దిల్ రాజు
నిర్మాత: బెక్కెం వేణుగోపాల్
స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: నరేశ్ కుప్పిలి
సినిమాటోగ్రఫీ: ఎస్. మణికందన్
సంగీతం: రధన్
ఎడిటర్: గ‌్యారి బీహెచ్
లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి, కెకె, కిట్టు విస్సా ప్రగడ
ఫైట్స్: దిలీప్ సుబ్బరాయన్, రామకృష్ణ
డ్యాన్స్: విజయ్ ప్రకాశ్
ప్రొడక్షన్ డిజైనర్: లత తరుణ్
పీఆర్వోలు: వంశీ- శేఖర్, వంశీ కాక.
![]() |
![]() |