![]() |
![]() |

యంగ్ హీరో తేజా సజ్జా హీరోగా పరిచయం అవుతున్న చిత్రం 'జాంబిరెడ్డి'. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో వస్తున్న తొలి జాంబీ చిత్రమిది. ప్రస్తుతం వైరస్ పరిస్థితుల్ని తీసుకుని జాంబీ జోనర్‌లో కామెడీని జోడించి ఈ చిత్రాన్ని ప్రశాంత్ వర్మ తెరకెక్కించారు. ఈ శుక్రవారం బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్స్ ని ప్రారంభించారు. ఇందులో భాగంగా మరో యువ హీరో మాస్‌కా దాస్ విశ్వక్ సేన్ ప్రమోషనల్ ఇంటర్వ్యూ కోసం తేజతో చేరాడు.
తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమోని వదిలారు. ప్రోమోలో మాస్‌కా దాస్ విశ్వక్ సేన్ హీరో తేజని ఆడుకోవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఓ దశలో ఇద్దరి మధ్య కౌంటర్.. ఎన్‌కౌంటర్ తరహాలో వాడీ వేడీ పంచ్‌లు పడ్డాయి. పోస్టర్ ఎలా వుందని హీరో తేజ అడిగితే .. "పాత ఫిల్మే కదా" అని విశ్వక్ సేన్ ఆటపట్టించడం..తేజ అలిగి లేచి వెళ్లిపోవడం.. ఆ తరువాత "పోస్టర్ మొత్తం నువ్వే వున్నవ్.. నువ్వు కూడా కథ, స్క్రీన్‌ప్లే , డైరెక్షన్, ప్రొడక్షన్.. (మధ్యలో బీప్ సౌండ్) .. నన్ను చూసి ఇన్స్‌ప్రైర్ కాలేదు కదా"అని అని విశ్వక్ అడిగితే. "ఛీఛీ" అంటూ తేజ తలగోక్కోవడం... ఆసక్తిని రేకెత్తిస్తోంది.
మళ్లీ విశ్వక్ అందుకుని "డైరెక్టర్ ఎవరూ?" అంటే.. "డైరెక్టర్ ప్రశాంత్ వర్మ".. అని ఇంతకు ముందు "అ!, కల్కీ," అని చెబుతుండగానే .. విశ్వక్ మళ్లీ అందుకుని "బాగా కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌లు తీస్తుంటడు".. అనడం.. "అవన్నీ నువ్వు గుర్తు పెట్టుకో" అని తేజ సీరియస్‌గా విశ్వక్‌కు కౌంటర్ ఇవ్వడం.. "ఇరవై ఏళ్ల నుంచి నేను ఇక్కడే వున్నా. మరి నువ్వు ఎప్పుడొచ్చావో తెలియదు.. సో నాకు సలహా ఇస్తున్నావ్ ఎలాంటి సినిమా చేయాలని".. అనితేజ సీరియస్ టోన్‌లో వార్నింగ్ లా మాట్లాడటం.. అది విని విశ్వక్ "కెమెరా ఆన్‌లో వుందా?" అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడం ... చూసే వారికిది సీరియస్ టర్న్ తీసుకుందేంటి అనేలా తోచడం ... ఆసక్తిని రేకెత్తిస్తోంది. చివరికి విశ్వక్ సేన్ "అలా అంటే థియేటర్‌లో సినిమా ఆడియన్‌లా నువ్వే చూసుకో".. అంటూ పంచ్ ఇవ్వడం కొసమెరుపు.
![]() |
![]() |