![]() |
![]() |

'డ్యాన్స్ బేబీ డ్యాన్స్' ప్రోగ్రామ్‌తో బుల్లితెరపై ఓంకార్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ షోతో చాలా మంది డ్యాన్సర్స్‌ని వెలుగులోకి తీసుకొచ్చారు. డ్యాన్సింగ్ గురు సుందరం మాస్టర్ హోస్ట్‌గా వ్యవహరించిన ఈ షో టాప్ రేటింగ్స్‌తో అగ్ర స్థానంలో నిలిచి ఓంకార్‌కి మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. మళ్లీ అదే తరహా డ్యాన్స్ షోతో అదరగొడుతున్నారు ఓంకార్.
ఆయన తాజాగా స్టార్ మా కోసం డిజైన్ చేసిన 'డ్యాన్స్ ప్లస్' ఇటీవలే మొదలైంది. ఇందులోనూ మెలోడ్రామాని యాడ్ చేస్తూ వీకెండ్‌లో శని, ఆదివారాలు రసవత్తర ఎపిసోడ్‌లతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అదీ సరిపోలేదని, దీనికి మరింత గ్లామర్‌ని, పాపులారిటీని యాడ్ చేయాలన్న ఉద్దేశ్యంతో బుల్లితెరపై పాపులర్ అయిన వాళ్లని, బిగ్‌బాస్ కంటెస్టెంట్‌లని కూడా రంగంలోకి దింపేశారు.
'కార్తిక దీపం' ద్వారా పాపులర్ అయిన హిమ, శౌర్యని కూడా ఈ షో కోసం వాడేశారు. అంతే కాకుండా బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ లో మోనాల్‌ని ఇప్పటికే న్యాయ నిర్ణేతగా హాట్ సీట్లో కూర్చోబెట్టిన ఓంకార్ బిగ్‌బాస్‌లో పాపులర్ అయిన 'దిల్ సే' మోహబూబ్, దేత్తడి హారికని కూడా ఈ షోలో పోటీపడుతున్న కొన్ని టీమ్‌ల కోసం దించేశారు. హారిక, 'దిల్ సే' మెహబూబ్, 'కార్తీక దీపం' హిమ, శౌర్య మూడు టీమ్‌లకు సపోర్ట్‌గా నిలిచి తమదైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు. అయితే ఇందులో 'దిల్ సే' మెహబూబ్ సపోర్ట్‌గా నిలిచిన జియా ఠాకూర్ ఆదివారం ఎపిసోడ్ విన్నర్‌గా నిలిచింది.
![]() |
![]() |