![]() |
![]() |

ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే ఈతరం నటీమణుల్లో అనుష్క ఒకరు. మహిళా ప్రాధాన్య చిత్రాలకు చిరునామాగా నిలిచే ఈ టాలెంటెడ్ బ్యూటీ.. ఎక్కువగా థ్రిల్లర్, హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ ఉన్న ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ లోనే దర్శనమిచ్చారు. అరుంధతి, రుద్రమదేవి, భాగమతి, నిశ్శబ్దం.. ఇలా సీరియస్ రోల్స్ లోనే కనిపిస్తూ వచ్చిన స్వీటీ.. త్వరలో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చేయబోతున్నారు.
తనతో 'మిర్చి', 'భాగమతి' వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ ని నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మించనుందట. కుటుంబ బంధాలకు పెద్దపీట వేసే ఈ సినిమాలో కథంతా అనుష్క పాత్ర చుట్టూనే తిరుగుతుందని.. ఇదివరకు చేయని ఓ కొత్త తరహా భూమికలో స్వీటీ దర్శనమిస్తారని టాక్. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి దర్శకుడు, ఇతర వివరాలు వెల్లడయ్యే అవకాశముంది. మరి.. ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో అనుష్క ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.
![]() |
![]() |