![]() |
![]() |

బిగ్‌బాస్ సీజన్ 4 ఇటీవలే విజయవంతంగా ముగిసింది. ఈ సీజన్ ప్రారంభంలో కంటెస్టెంట్లపై వచ్చిన విమర్శలు ఏ సీజన్‌కి రాలేదు. ఇందులో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్‌లలో చాలా మంది ఎవరికీ పెద్దగా తెలియదు. అభిజీత్, మోనాల్, అమ్మరాజశేఖర్, లాస్య, కరాటే కల్యాణి, సూర్యకిరణ్, స్వాతీ తీక్షిత్, గంగవ్వ తప్ప మరెవరికీ పెద్దగా ప్రేక్షకుల్లో ఫాలోయింగ్ లేదు. ఇలాంటి అన్‌నోన్ ఫేసెస్‌ని ఫేమస్ బిగ్‌బాస్ షోకి సెలెక్ట్ చేశారేంటి అంటూ సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగింది.
అయితే కొవిడ్ మహమ్మారి వ్యాప్తి కారణంగా పేరుపొందిన సెలబ్రిటీలు పలువురు ఈ షోలో పాల్గొనడానికి ఆసక్తిని చూపించకపోవడంతో యూట్యూబ్‌లో ఫేమస్ అయిన వారిని, టీవీ హోస్ట్‌లని బిగ్‌బాస్ సీజన్ 4కి కంటెస్టెంట్‌లుగా ఎంపిక చేశారు. మొదట్లో కొంత విమర్శలు మొదలైనా ఆ తరువాత తరువాత షో కుదురుకుంది. టీఆర్పీ కూడా ఆశ్చర్యపరిచే స్థాయిలో రావడంతో బిగ్‌బాస్ మేకర్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని సీజన్ 5 కోసం పాపులర్ ఫేస్‌లనే ఎంపిక చేయాలనుకుంటున్నారట.
ఇప్పటి నుంచే సీజన్ 5 కోసం కంటెస్టెంట్‌లని ఎంపిక చేసే ప్రక్రియని మొదలుపెట్టారంటూసోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. ఇందులో భాగంగా యూట్యూబ్‌లో పాపులర్ అయిన షణ్ముఖ్ జస్వంత్‌ని సీజన్ 5 తొలి కంటెస్టెంట్‌గా ఎంపిక చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఓంకార్ నిర్వహిస్తున్న 'డ్యాన్స్ ప్లస్'లో ఓ గ్రూప్‌కి సపోర్ట్‌గా నిలవడం కోసం ఎంట్రీ ఇచ్చిన షణ్ముఖ్ స్టేజ్‌పై మెరుపులు మెరిపించాడు. అతని డ్యాన్స్‌కు ఫిదా యిన మోనాల్ అతనితో కలిసి స్టెప్పులేయడం విశేషం.
![]() |
![]() |