![]() |
![]() |

పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు.. ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు యువ దర్శకుడు అనిల్ రావిపూడి. కరోనా కారణంగా తదుపరి చిత్రం విషయంలో గ్యాప్ వచ్చినా.. తన నెక్స్ట్ వెంచర్ గా 'ఎఫ్ 2' సీక్వెల్ ప్లాన్ చేశారు అనిల్. ఈ లోపే మరో ప్రాజెక్ట్ ని కూడా సెట్ చేసుకున్నారట.
ఆ వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం 'క్రాక్', 'ఖిలాడి' చిత్రాలతో బిజీగా ఉన్న మాస్ మహారాజా రవితేజకి తాజాగా ఓ స్టోరీ లైన్ వినిపించారట అనిల్. సబ్జెక్ట్ నచ్చడంతో రవితేజ కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అంతేకాదు.. షైన్ స్క్రీన్స్ సంస్థ ఈ క్రేజీ వెంచర్ ని నిర్మిస్తుందని టాక్. మరి.. 'రాజా ది గ్రేట్' తరువాత రవితేజ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రానున్న ఈ సినిమా అదే మ్యాజిక్ ని కొనసాగిస్తుందేమో చూడాలి. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశముంది.
![]() |
![]() |